దేశంలోనే మందు తాగుడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. అక్కడ జనాలే బాగా మందు కొడతారనుకుంటే పొరపాటే. ఎపి పోలీసులు కూడా మందు కొట్టి రోడ్ల మీద లొల్లి చేస్తున్నారు. ఆ లొల్లేదో ఎపిలో చేస్తే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. వాళ్లు ఏకంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోనే లొల్లి పెట్టుకున్నారు. నడి రోడ్ల మీద సామాన్య మానవుల వలే లొల్లి పెట్టుకుని విమర్శలపాలయ్యారు. కింద వీడియో… వివరాలు ఉన్నాయి.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో ఎపి పోలీసులు ఆదివారం రాత్రిపూట గలాట పెట్టుకున్నారు. మధు అనే ఎపిఎస్పీ కానిస్టేబుల్ ను పోలీసులు బలవంతంగా తమ ఆంధ్రా పోలీసు వాహనం (జీపు నెంబర్ AP9P 7167)లో గుంజుకుపోయే ప్రయత్నం చేశారు.
వారి బారినుంచి తప్పించుకునేందుకు మధు అనే కానిస్టేబుల్ జీపు నుంచి కిందకు దునికి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ కానిస్టేబుల్ ను పట్టుకునేందుకు ఆంధ్రా పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో వారికి ఆయనకు మధ్య తోపులాట వాగ్వాదం జరిగాయి. మధుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా విజయవాడ తరలిస్తున్నట్లు బాధిత కానిస్టేబుల్ ఆరోపించారు. పోలీసుల పెనుగులాటను స్థానికులు మీడియా పేరుతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
కానిస్టేబుల్ మధు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేయడంతో జీపులో వెంబడించారు ఎపి పోలీసులు. స్థానికుల జోక్యంతో మధును వదిలేసి ఎపి పోలీసులు మెల్లగా జారుకున్నారు. అయితే ఈ ఘటనలో మధు తాగి ఉన్నట్లు చెప్పారు. మిగతా పోలీసుల గురించి మాత్రం చెప్పలేదు.