ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్ష దీక్షకు దిగాయి. దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కు, మరో కాంగ్రెస్ నేత నగేష్ కు వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. కొట్టుకున్నారు. తోపులాటలో వీహెచ్ కింద పడ్డారు. కోదండరాం, ఇతర నేతలు విహెచ్ ను లేపారు. తర్వాత ఇద్దరిని శాంతింపజేశారు.