లాస్ట్ మినిట్ లో విమాన టికెట్ కొనాలంటే చాలా కష్టం. టికెట్ ధర భారీ గా ఉంటుంది. ప్రయాణికుల అత్యవసరాన్ని విమానయాన కంపెనీలు సొమ్ముచేసుకుంటూ ఉంటాయి.రాయితీకి టికెట్ రావాలంటే నెలల ముందు బుక్ చేసుకోవలసి ఉంటుంది. నిజానికి ప్రతివిమానంలో కనసం పది శాతం టికెట్లు ఖాళీగా ఉంటాయి. అయినా సరే మామూలు రేటుకుటికెట్లను విక్రయించరు. వాటిమీద రాయితీ ఇచ్చి ప్రయాణికులను ప్రోత్సహించవచ్చు. అలా చేయవు. లాస్ట్ మినిట్ లో వచ్చినందుకు బాదుడే.
అయితే ఎయిర్ ఇండియా ఈ విషయంలో ఒకడుగు ముందుకేసింది. ఎలాగూ ప్రతిసర్వీస్ లో చాలా సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి వాటిని తక్కువ ధరకు అమ్మితే ఎంతో కొంత సొమ్మలొస్తాయిగదా అన్న నిజం పబ్లిక్ సెక్టర్ ఎయిర్ ఇండియా గుర్తించింది.
దీనితో భారీగా లాస్ట్ మినిట్ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే, దేశంలో జరిపే ప్రయాణాలకు (డొమెస్టిక్) మాత్రమే వరిస్తుంది.
విమానం బయలు దేరడానికి మూడుగంటలలోపు టికెట్లు కొనేవారందరికి ఈ రాయితీ వర్తిస్తుంది.ఇలా డిపార్చర్ కు మూడుగంటల ముందు టికెట్లు కొనేవాళ్లకు మామూలు ధరలో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనంజయ్ కుమార్ చెప్పారు.
ఇతర విమాన సంస్థలకు ఇబ్బంది కలిగించే విషయమే అయినా, ఇది చాలామంది ప్రయాణికులకు మేలు చేస్తుంది. ఎందుకంటే, అనుకోకుండా పనులు బడి విమానాలలోప్రయాణం చేయాల్సి వచ్చే వాళ్లు చాలా మంది ఉంటారు. ఇతర ప్రయివేటు కంపెనీలువాళ్లనుంచి భారీగా టికెట్ ధర వసూలు చేస్తూ ఉంటాయి.
ఈ కొత్త నిర్ణయం వల్ల ఎయిర్ ఇండియా ప్రయాణికులకు మేలుజరగడంతో పాటు, ఈ కంపెనీ విమానాలలో ఖాళీ సీట్ల సంఖ్య తగ్గుతుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమానాలలొ ప్యాసెంజర్ ఆక్యుపెన్సీ రేటు (ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ )చాలా తక్కువ. డిజిసిఎ డేటా ప్రకారం ఎయిర్ ఇండియా సీట్ ఆక్యుపెన్సీ రేట్ కేవలం 80.0 శాతమే. ఇదే స్పైస్ జెట్ లో 93 శాతం, గో ఎయిర్ లో91.4 శాతం, ఎయిర్ ఏపియాలో87.5 శాతం విస్తారాలో 86.8శాతం, ఇండిగో లో 86 శాతం ఉంది.