తనకి టిఆఆర్ ఎస్ లోకి ఆహ్వానం అందిందని కాంగ్రెస్ నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) వెల్లడించారు.
‘కేసీఆర్, కెటిఆర్ బంధువులు నన్ను పార్టీ లోకి రమ్మని ఆహ్వానించారు.మే 25 నుండి 30 వ తారిక్ లోపు తెలుస్తుంది నేను గాంధీ భవన్ లో ఉంటానో trs భవన్ లో ఉంటానో కాలమే నిర్ణయిస్తుంది,’ అని ఆయన చెప్పారు.
తాను టిఆర్ ఎస్ లో చేరే అవకాశం నర్మగర్భంగా వెల్లడించారు. కాంగ్రెస్ మీద చురకలు వేశారు. తన లీడర్ గా ఎదగడంలో కాంగ్రెస్ పాత్ర లేదని తేల్చేశారు. పార్టీతో తనకు అనుబంధం చాలా తక్కువే నని, తన విజయంలో సగం తన పాత్ర ఉందని చెప్పారు.
‘మే 25 నుండి 30 వ తారిక్ లోపు కేసీఆర్ బంధువులు మళ్ళీ నన్ను కలిస్తే నా నిర్ణయం చెపుతాను,’ అని కూడా చెప్పారు.
ఈ రోజు ఆయన గాంధీ భవన్ లో మీడియా తో ముచ్చటించారు.
జగ్గారెడ్డి చెప్పిన మరిన్ని ఆసక్తి కరమయి విషయాలు:
*కేంద్రంలో యుపిఎ వస్తేనే తెలంగాణ లో కాంగ్రేస్ సేఫ్ జోన్ లో ఉంటుంది.
* టిఆర్ ఎస్ లోకి పోవాలని జగ్గారెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అని జరుగుతున్న ప్రచారం బూటకం.
*నేను స్వ శక్తి తో ఎదిగాను..పార్టీ బ్యానర్ పై గెలిచిన నేతను కాను.
* నేను ఏ పార్టీ లో ఉన్నా పార్టీ చెప్పింది సగం వింటాను మిగతా సగం నా నిర్ణయాలు ఉంటాయి.
* కాంగ్రెస్ లో కూడా అధిష్టానం చెప్పింది సగం వింటాను.. మిగతా సగం నా నిర్ణయాలు ఉంటాయి.
* రెండు రాష్ట్రాలు చేయడం వలన రాజకీయంగా కాంగ్రెస్ దెబ్బతిన్నది.
* తెలంగాణ ప్రజలకు ఎంత లాభం జరిగిందో నాకు తెలవదు.
* కాంగ్రెస్ లో అధిష్టానం కు చెప్పాలంటే ద్వారపాలకులకు చెప్పాలి కానీ మనం చెప్పింది వాళ్ళు చెపుతారో లేదో చెప్పలేము.