ఎపుడూ సంచలన వార్తలను అందించే టివి9 ఇపుడు సంచలన వార్త అయింది. పోర్జరీ సంతకాలు, అక్రమంగా నిధుల మళ్ళింపు వంటి వార్తలు సాధారణంగా ప్రభుత్వంలో జరుగుతుంటాయి. ఇలాంటివార్తలను పసిగట్టి టివి చానెళ్లు సంచనాలను సృష్టిస్తూ ఉంటాయి.ఇలాంటి వార్తలలో ముందుండేది టివి9. ఇపుడు ఇలాంటి వార్త తానే అయి అందరికంటే ముందు సంచలన వార్త అయింది టివి9. ఈ టివిచానెల్ కు జర్నలిస్టు రవిప్రకాశ్ సిఇఒ.
ఆయన దర్శకత్వంలో టివి 9 కొత్త దారులు తొక్కింది. అయితే అడ్డు దారులు కూడా తొక్కిందని ఆరోపణలు వస్తున్నాయి. దీనితో టివి యాజమాన్య వివాదం సంచలన వార్త అయింది.
తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. సంస్థ నిధులు దారి మళ్లించారని, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫిర్యాదులు చాలా సీరియస్ వ్యవహారం. వార్తలు సృష్టించే మనిషి ఇపుడు హెడ్ లైన్ అయ్యాడు. ఈ పోర్జరి, నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో రవిప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. రవి ప్రకాష్‌తో పాటు ఆయన అనుంగు నేస్తం నటుడు శివాజీ ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
మరొక వైపు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో టీవీ 9 యాజమాన్య కేసు విచారణ చేపడుతున్నది.
జారాహిల్స్‌లో టీవీ9 ప్రధాన కార్యాలయంలో కూడా పోలీసులు సోదాలు చేశారు.
ఇవన్నీ జరగుతూ ఉండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా టీవీ9 ప్రధాన కార్యాలయం ముందు పోలీసులు భారీగా మొహరించారు.