గ్రూప్ టు పరీక్షలో చంద్రబాబు మీద ప్రశ్నలా?: వైసిపి అభ్యంతరం

నిన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలో.. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా  తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలు వేయడంపై పార్టీ నేతలు  అంబటి రాంబాబు, ఎంవీఎస్ నాగిరెడ్డి  అభ్యంతరం తెలిపారు.  ఈరోజు అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసి ఏపీపీఎస్సీ, చంద్రబాబు ప్రభుత్వం  తీరు మీద ఫిర్యాదు చేశారు.

అనంతరం విజయవాడలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వారుచేసిన విమర్శలు

అంబటి రాంబాబు…

◆ పోలింగ్ ముగిసిన తరువాత నుంచీ చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈసీ, ఈవీఎంలు, వీవీ ప్యాట్ లు.. అంటూ ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు.  నిన్న జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలో.. ఎన్నికల్ కోడ్ అమలులో ఉండగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, చంద్రబాబుకు సంబంధించిన ప్రశ్నలు ఎలా అడుగుతారు? ఒకవైపు ఎన్నికల రీపోలింగ్ జరుగుతుంటే ఇలాంటి ప్రశ్నలా? ఏపీపీఎస్సీలో చంద్రబాబు మనుషులు ఉన్నారు కనుకే ఉడతా భక్తిగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. టీడీపీ ఎన్నికల గుర్తు ఏంటి? చంద్రబాబు మనవడి పేరు ఏంటి? లోకేశ్ పోటీ చేసిన నియోజకవర్గం పేరు ఏమిటి? అని అడగకపోవడం సంతోషం.

◆ ఏపీపీఎస్సీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేశాం. చట్టానికి, ఎన్నికల కోడ్ కి వ్యతిరేకంగా వ్యవహరించిన ఏపీపీఎస్సీ పై చర్యలు తీసుకోవాలి. ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించినందుకా? చంద్రబాబు అంటే ఎంత భక్తి అవసరమా అని అన్నారు.

◆ ఎట్టిపరిస్థితుల్లో ఈ నెల 23న చంద్రబాబు అధికారం కోల్పోతారు, అధికారం లేకపోతే చంద్రబాబు ఉండలేరు. చంద్రబాబు తన ఓటమిని అంగీకరించలేకపోతున్నారు.

◆ పోలవరం సందర్శించే నైతిక అర్హత లేదు చంద్రబాబు కి ఎక్కడిది? 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, నీళ్ళు ఇచ్చి ఎన్నికల్లో ఓటు అడుగుతామని చంద్రబాబు 2014లో చెప్పారు. మరి ఎందుకు అలా చేయలేదు?

.

◆ చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టడం ఏమిటి? చంద్రబాబు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా అధికారులేవరూ రారు.. చంద్రబాబు ఇప్పుడు క్యాబినెట్ లో తీసుకునే నిర్ణయాలు ఎందుకూ పనికిరావు.. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో క్యాబినెట్ ఒకటి.

◆ ఈ నెల 23 తేదీన చంద్రబాబు దీపం ఆరిపోబోతుంది. తనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని భయపడుతున్నాడు. తన ఓటమిని అంగీకరించలేక ఎన్నికల కమిషన్ పై రుద్దుతున్నాడు…

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి

◆ చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘంలోనూ తమ కోవర్టులను పెట్టుకొని ఆఖరికి ఈసీని కూడా భ్రష్టుపట్టించాలని ప్రయత్నించారు. ఎన్నికల సంఘం లో ఉన్న ఉద్యోగులు కొందరు అధికార పార్టీకి అన్ని చేరవేస్తున్నారు. దీనిపై ఆధారాలతో సహా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేం ఫిర్యాదు చేశాం.

◆ చంద్రబాబు మళ్ళీ సీఎం అయితే ఇంకో 5ఏళ్ళు కూడా పోలవరం పూర్తికాదు.

◆ చంద్రబాబు ఎన్నికల నిబంధనలను అడుగడుగునా ఉల్లంఘించారు

◆ తెలుగుదేశం పార్టీ మాపై చేసిన ఆరోపణలన్నించికి మేం సమాధానం చెప్పారు. అలానే టీడీపీ ఎన్నింటికి సమాధానం ఇచ్చిందో బయట పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *