బిజెపి 2019 ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారంలోకి రావడం సాధ్యం కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం అంటున్నారు. ఆయన వివరణ ఇది:
ఈ ఎన్నికల్లో రెండు బాగాలున్నాయి. మొదటి భాగంలో మొదటి 3 దశలపోలింగ్ ఉంటే రెండో భాగంలో మిగతా నాలుగు దశల పోలింగ్ ఉంటుంది. మొదటి మూడు దశలలో 302 నియోజకవర్గాలలో ప్రజలు వోటేశారు. ఇందులో 2014ఎన్నికల్లో బిజెపి 113 స్థానాలను గెల్చుకుంది. వీటిలో ఈ సారి సగం స్థానాలనుకూడా భారతీయ జనతా పార్టీ గెల్చుకునే స్థితిలో లేదు. ఒక వేళ వీటిలో 60 స్థానాలను బిజెపి గెల్చుకుంటుందనుకుందాం, పోలింగ్ జరగాల్సిన నాలుగు దశలో నియోజకవర్గాలలో 200 కంటే ఎక్కువే గెల్చుకోవాలి. అయితే, ఇంక పోలింగ్ జరగాల్సింది కేవలం 240 నియోజకవర్గాలలోనే. ఇందులో 161 స్థానాలను 2014 లో బిజెపి గెల్చుకున్న మాట నిజమే. ఒక వేళ ఈ 161 స్థానాలను బిజెపి తిరిగి గెల్చుకున్నా, వాటికి మొదటి దశలలో వచ్చే 60 సీట్లు కలుపుకున్నా బిజెపికి ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ రాదు. మొదటి బాగంలో 60 స్థానాలలో గెలవడం, రెండవ భాగంలో 161 మిగిలించుకోవడం అసంభవం. ఇది గ్రౌండ్ రియాలిటీ. అందువల్ల ఎన్నికల తర్వాత ప్రత్యామ్నాయ సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు జరగుతాయి,’ అని ఆయన దక్కన్ హెరాల్డ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే, బిజెపి రూలింగ్ పార్టీగ, బాగా డబ్బున్న పార్టీ అయినప్పటికీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతు తెచ్చుకోవడంలో విజయవంతం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
‘1996 పరిస్థితి పునారావృతం కావచ్చు. 1996లో వాజ్ పేయి ప్రభుత్వం లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజారిటీ లేదు. వాజ్ పేయి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంది. అప్పటి రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వాజ్ పేయికి 13 రోజుల గడువు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టేందుకు బిజెపి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. వీలుకాలేదు. వాజ్ పేయి ప్రభుత్వం బలం నిరూపించుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చింది, ఇది వేరే విషయం. చెప్పొచ్చేదేమంటే, మే 23 తర్వాత 1996 నాటి పరిస్థితి రావచ్చు. ఇపుడు కూడా బిజెపి ఇతరపార్టీ లనుంచి ఎంపిలను కూడగట్టేందుకు అన్నిప్రయత్నాలు చేస్తుంది. బిజెపి విజయవంతకాలేదని నేను కచ్చితంగా చెబుతున్నాను. దేశ ప్రజల మనోభావాలు ఇపుడలావున్నాయి. ఏదయినా పార్టీ కి 2014 లో వచ్చినంత మెజారిటీ వచ్చినపుడు, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలలో ఒకటి కూడా అమలుచేయలేకపోతే, ఆ పార్టీ కచ్చితంగా వోడిపోతుంది. అదే ఇపుడు జరుగబోతున్నది,’ అని ఏచూరి చెప్పారు.
1996 రాజకీయ పరిణామాలెలా సాగాయే ఈ వీడియో చూడండి