ప్రకృతి కనికరించినా పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని రాయలసీమ ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతం చేయడానికి పాము – నిచ్చెన ఆటను రాయలసీమ సాగునీటి సాధన సమితి రూపొందించింది.
ప్రాథమికోన్నత పాటశాల, కళాశాలలో రాయలసీమ అంశాలపై రాయలసీమ యువతకు అవగాహన పెంపొందించడానికి ఈ ఆటను వినియోగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి భావిస్తున్నది.
ఇందులో పొందుపర్చిన పాము – నిచ్చెన ఆటకు ఇంకా అనేక అంశాలను జోడించి రాయలసీమ యువతకు, మహిళా చైతన్యానికి వినియోగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి భావిస్తున్నది.
మే 31, 2019 నాడు జరిపే సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఆట ద్వారా ప్రజలను ముఖ్యంగా మహిళలను యువతను మరింత చైతన్యవంతం చేయడానికి కార్యాచరణ చేపట్టడమైనది.
వివరాలు (ఫోటో మీద క్లిక్ చేయండి)
Jai Rayalaseema Jai Jai Rayalaseema