మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి ఈ ఉదయం చనిపోయారు.
జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అనారోగ్యంతో హైటెక్‌సిటీలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటెరాలజీ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఐసీయూలోకి మార్చారు.
ఈ ఉదయం ఆయన చనిపోయారు. ఈ రోజు సాయంకాలం అయిదు గంటలకు అంత్యక్రియలుంటాయి.
ఆయన చివర నిర్వహించిన పదవి తెలంగాణ లోకాయుక్త. 2017లో ఆయన ఈ పదవి నుంచి రిటైరయ్యారు.
సుభాషణ్ రెడ్డి మార్చి 2, 1943న హైదరాబాద్ లో జన్మించారు. చాదర్ ఘాట్ హైస్కూల్, ఉస్మానియా యూనివర్శిటీలలో విద్య నభ్యసించి 1966 లో న్యాయ వాద వృత్తి చేపట్టారు.
1991లో ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2001లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు.2005లో రిటైరయ్యాక ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కు మొదటి చైర్మన్ గానియమితులయ్యారు. తర్వాత 2012లో ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రలకు ఉమ్మడి లోకాయుక్తగా 2017 దాకా పనిచేశారు.