పేరుకేమో పే..ద్ద బాబా, ఆయన మీద ఉన్నవి రేప్ ఆరోపణలు. ఒక అత్యాచారణ ఆరోపణ విచారణలో ఉంది.మరొక అత్యాచారం కేసులో ఇప్పటికే శిక్ష పడింది. జైలులో ఉన్నాడు.
ఈ లోపు బాబా కొడుకు రంగం మీదకు వచ్చాడు. ఆశ్రమంలో తండ్రి బాటలోనే నడిచాడు. ఆయన మీద కూడా అత్యాచారం ఆరోపణలొచ్చాయి. తండ్రిబాటలో బాబాకొడుకు కూడా ఇపుడు జైలు కెళుతున్నాడు.
ఈ వ్యవహారమంతా ఎవరిదనుకుంటున్నారు. బాగా పేరుమోసి, ఆర్థికంగా బలిసిన ఆశారాం బాబా కుటుంబానిది.
ఆయన కుమారుడు నారాయణ్ పాయి కి సూరత్ (గుజరాత్ )సెషన్స్ కోర్టు నిన్న ఒక అత్యాచారం కేసులో జీవిత ఖైదు విధించింది. దానితో పాటు లక్షరుపాలయ జరిమానా విధించిది.
2013లో ఒక శిష్యరాలు చేసిన ఆరోపణ తో నారాయణ సాయి లీలలు బయటకొచ్చాయి.
సాయితోపాటు అతగాడికి సహకరించిన ఇద్దరు మహిళలు ధర్మిష్ట అలియాస్ గంగ, భావన అలియాస్ జమున, ఒక సహాయకుడు పవన్ అలియాస్ హనుమాన్ లకు 10 సంవత్సరాల జైలు శిక్ష అయిదువేల రుపాయల జరిమానా కోర్టు విధించింది. ఈ మహిళలిద్దరు బాధితురాలిని తమ గదిలో నిర్భందించి తర్వాత నారాయణ సాయి రూంకు లాక్కెళ్లారు.
సాయి పరారీ లో ఉన్నపుడు ఆశ్రయమిచ్చన రమేష్ మల్హోత్రా అనే డ్రైవర్ కు ఆరునెలల జైలు శిక్ష అయిదొందల ఫైన్ పడింది. అంతేకాదు, బాధితురాలికి అయిదులక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించ్చింది.
ఆశ్రమంలోని సేవికా సోదరీమణలు అత్యాచారం ఫిర్యాదు చేసిన తర్వాత అరెస్టు ను తప్పించుకునేందుకు అయిదు నెలల పాటు సాయి పరారీలో ఉన్నాడు. చివరకు 2013 డిసెంబర్ లో హర్యానా లోని కురుక్షేత్రలో దొరికాడు.ఇద్దరు అక్కాచెల్లెళ్లు బాబా మీద, బాబా కొడుకు మీద ఫిర్యాదు చేశారు. అహ్మదాబాద్ 1997-2001 మధ్య తాను ఆశ్రమంలో ఉన్న పుడు ఆశారాం బాబా అత్యాచారం చేశాడని అక్క ఫిర్యాదు చేసింది. 2002-2005 తాను జహంగీర్ పురా ఆశ్రమంలో ఉన్నపుడు సాయి తన మీద అత్యాచారం చేశాడని చెల్లెలు ఫిర్యాదుచేసింది.
ఆశారాం బాబా మీద గాంధీనగర్ సెషన్స్ కోర్టులో ఈ కేసు ఇంకా విచారణ లో ఉంది. మరొక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన కేసులో బాబా జోధ్ పూర్ జైలులో ఉన్నాడు.