ఈ మధ్య కాలంలో ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనావేయడం లో సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సిపిఎస్) విజయవంతమయింది. ఈ సంస్థ చీఫ్ డాక్టర్ వేణుగోపాల్ తాజా అధ్యయనం ఫలితాలను వెల్లడించారు. దీని ప్రకారం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 121 నుంచి 124 స్థానాలు లభిస్తాయి.తెలుగుదేశం పార్టీకి 42-46 స్థానాలు వస్తుంటే, జనసేనకు 0-2 స్థానాలు లభిస్తున్నాయి.
రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా చూస్తే వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు ఉత్తరాంధ్రలో 20, కోస్తాంధ్ర లో 42, దక్షిణ కోస్తాంధ్రలో 22, రాయలసీమలో 40 స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో 10, కోస్తాంధ్రలో 22, దక్షిణ కోస్తాంధ్రలో నిల్, రాయలసీమలో 10 స్థానాలు లభిస్తున్నాయి. మొత్తంగా వైసిపికి 124, టిడిపిక 42 సీట్లు వస్తున్నాయి. అయితే 9 స్థానాలలో గట్టి పోటీ ఉంటుంది.
ఇదే సంస్థ గతంలో ఎన్నికల ముందు జరిపిన ప్రిపోల్ సర్వే ఫలితాలు, ఆపైన ఎన్నికల తర్వాత పసుపు కుంకుమ లబ్దిదారులు, లబ్దిపొందని వారు, రైతులు, వయోజనుల తో జరిపిన సంభాషణలు, ఎన్నికల్లో డబ్బు పంపిణీ, కుల సమీకరణలమీద సీనియర్ పరిశోధకుల అభిప్రాయలను క్రోడీకరించి డాక్టర్ వేణుగోపాల్ ఈ అంచనాకు వచ్చారు. ఆ వివరాలు ఇవి.
పార్టీల మధ్య వోట్ షేర్ ఇలా ఉండవచ్చు
ఎన్నికల్లో రానున్న ఫలితాల అంచనా
పూర్తి నివేదిక CPS Latest Projections ఉంది.