నేడు శ్రీశ్రీ వర్ధంతి
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ప్రాంతంలోని కాశీపురం గ్రాంమలో కామ్రేడ్ గంగిరెడ్డి కొండారెడ్డి అంటే నాటి విప్లవ రాజకీయాలకు నిలువెత్తు చిహ్నం. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ లోను ఆ తర్వాత యం.యల్ పార్టీలలో చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి లను అనుసరించాడు. 1980 లలో రాయలసీమ విషయంగా విశేష కృషిచేసారు.
“కరువుకాటకాలలో కన్బీటి కోన రాయలసీమ” పేరిట కరపత్రాలను ప్రచురించారు.
ఆ తర్వాత క్రాంతి ప్రచురణల పక్షాన పుస్తకంగా వెలువరించారు. తన చివరి దశలో విరసంలో క్రియాశీలకంగా పని చేసారు. విరసం తొలి ప్రచురణగా రైతుకూలీల నేపథ్యంలో ఇతను రాసిన “నాంది” నాటకం వెలువడింది.
1976 లో పోలీసులు కొండారెడ్డి పై కనబడితే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసారు. ఈ క్లిష్టమైన పరిస్థితులలో కొండారెడ్డి గారి కూతురు భారతి వివాహాన్ని తిరుపాలరెడ్డి తో శ్రీ శ్రీ గారు అన్నీ తానై ముందుడి జరిపించారు. స్వయంగా అయన సాక్షి సంతకం చేశారు.
శ్రీ శ్రీ గారితో అనేక సభలను కొండారెడ్డి నిర్వహింపచేసారు. శ్రీ శ్రీ గారికి సీమ ప్రాంతంతో అనుబంధాలను త్వరలో రికార్డు చేస్తాం.
కుమారుడు కాశీపురం సుధాకర రెడ్డి సీమ సాగునీటి ఉద్యమాలలో పాలుపంచుకొంటున్నారు.
-డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి.
రాయలసీమ సాంస్కృతిక వేదిక.