FLASH హిమాలయాల్లో మంచుమనిషి సంచారం… సాక్ష్యం ఇదిగో

హిమాలయాల్లో మంచుమనిషి తిరుగుతున్నాడా? యతి అనేమాట ఎపుడైనా విన్నారు.  యతి అంటే మంచుమనిషి. ఇతగాడు హిమాలయాలు మొదలుకుని సెంట్రల్ ఎషియా, సైబీరియా దాకా విస్తరించిన మంచుపర్వాతాలలో మంచుప్రాంతాలలో తిరుగుతూఉంటాడని కథలుకథలుగా చెబుతుంటారు. ఆ శాల్తి మీద రకరకాల కామిక్స్ వచ్చాయి. అంతే తప్ప ఇంతవరకు ఎపుడూ మంచుమనిషి (యతి) ఎవరి కంట పడలేదు. అందుకే  ఆతను లేదా ఆమె (అతను ఉన్నపుడు ఆమె ఉండాలిగా) గురించి ఆర్టిస్టు గీచిన బొమ్మలు తప్ప మరొక దిక్కులేదు. మొత్తానికి ఈ మంచుమనిషి, ఒక భీకరాకర వానరంగా చెబుతూ వస్తున్నారు. వానరం కాకపోతే, వానరం పోలిన మనిషి లేదా నరవానరం అనుకోండి. అయితే, ఇపుడు హిమాలయాల్లో ఇతగాడు సంచరిస్తున్నట్లు ఒక చిన్న ఆధారం దొరికిందది. ఈ జీవి పాదముద్రలనే అనుమానంవచ్చేంత పెద్ద పాద ముద్రలను భారతసైనికులు కనుగొన్నారు. జోక్ కాదు, నిజం. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వాటిని ఫోటోతీసి ట్విట్టర్ లో పెట్టారు. అయినా సరే చాలా మందికి అనుమానాలొస్తున్నాయి. కింద చూడండి.

ఏప్రిల్ 9 మకాలు బేస్ క్యాంపు దగ్గిర ఈ పాదముద్రలు కనుగొన్నట్లు సైనికులు చెబుతున్నారు.

ఈ పాద ముద్ర సైజు 32×15  అంగుళాలు. మకాలు  సముద్రమట్టానికి 8481 అడుగుల ఎత్తున సెంట్రల్ నేపాల్ ఉంటుంది. ఇది జనాలు వెళ్లే ప్రదేశం కాదు. దారి లేదు.

అయితే, ఈ వార్తను పోటోలతో సహా మిలిటరీ అధికారి ఒకరు ట్విట్టర్ లో పెట్టారో లేదో తెగ జోక్స్ వేస్తున్నారు. ఈ పాదముద్రలు snowman వి ఎలా అనగలరు, snow woman వి అయివుండవచ్చు గదా అని కొందరు, ఇంకా లోతుగా వెదకండి, రంభ ఊర్వవి కు దొరకవచ్చని ఇంకొందరు జోక్స్ ట్వీట్ చేశారు.


 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *