ప్రధాని నరేంద్ర మోదీ కూడా కోటీశ్వరుడయ్యాడు. ప్రధాని అయ్యాక ఆయన బాగానే ఆస్తి పొదుపు చేసుకున్నారు.
గత ఐదేండ్ల పదవీ కాలంలో ఆయన ఆస్తి 52 శాతం పెరిగి ఆయన్నికోటీశ్వరుడిని చేసింది.
అయితే, ప్రధాని పదవికోసం ఆయనతో పోటీపడుతున్న రాహుల్ గాంధీ ఆస్తికంటే ఇాది చాలా చాలా తక్కువ. ఏప్రిల్ అయిదో తేదీన ఆస్తిపాస్తుల మీద రాహుల్ గాంధీ కూడా ఎన్నికల కమిషన్ కు తన అఫిడవిట్ సమర్పించారు. దాని ప్రకారం కాంగ్రెస్ అధ్యక్షుని ఆస్తి రు. 15.88 కోట్లు. 2014 ఎన్నికలపుడు ఇది కేవలం రు. 9.44 కొట్లు మాత్రమే.
వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసేటపుడు మోదీ సమర్పించిన ఆఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రు. 2.51 కోట్లకు చేరింది.పార్లమెంటులో ప్రవేశిస్తున్న ఇతర కోటీశ్వరులతో మోదీని పోల్చలేం.అయినా సరే ఆయన ఆస్తి రెండు కోట్లు దాటింది.
ఆయన ఆస్తిలో చరాస్తి 2019 నాటికి 1.41 కోట్లు. స్థిరాస్తి రు.1.10 కోట్లు.
అఫిడవిట్ లో భార్య ప్రస్తావన వచ్చినా, ఆమె ఆదాయం వనరుల,వృత్తి గురించి తెలియదని (not known) పేర్కొన్నారు.
2014 ఎన్నికలపుడు సమర్పించిన ఆఫిడవిట్లో ఆయన చరాస్తి రూ. 51 లక్షలు మూడింతలు పెరిగి 2019 నాటికి రూ.1.41కోట్లకు చేరింది.
ఇందులో అధిక భాగం ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో ఉంది. ప్రధానికి ఒక్క పైసా కూడా అప్పులేదు. తనకు జీతం రాళ్లు, బాంకులో డిపాజిట్ చేసిన మొత్తం మీద వచ్చే వడ్డీ తప్ప మరొక ఆదాయపు వనరు లేదని ఆయన అఫిడవిట్ లోపేర్కొన్నారు.
స్థిరాస్తులకు సంబంధించి గుజరాత్ రాజధాని గాంధీనగర్ సెక్టార్ 1లో గల ఇంటి స్థలంలో నాలుగో వంతు వాటా ఉంది. దాని విలువ సుమారు రూ. 1,10కోట్లు. 2014తో పోల్చుకుం టే ఈ ఇంటి విలువ రూ.10లక్షలు పెరిగింది.
2019, మార్చి 31 నాటికి ఆయన చేతిలో రూ.38,750 నగదు ఉంది.
ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంటు నుంచి ఆయన కు దాదాపు రు.85,145, రిటర్న్ రావలసి ఉంది. ప్రధాన కార్యాలయం నుంచి మరొక మొత్తం రు.1,40,895 కూడా రావాలి. గుజరాత్ గాంధీనగర్ స్టేట్ బ్యాంక్ లో ఉన్న అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ రు.4,143 మాత్రమే.
గత అయిదు సంవ్సరాలలో ఆయన ఆదాయపు పన్ను శాఖ కుచూపించిన ఆదాయం రు. 19.92 లక్షలు 2018, రు. 14.59 లక్షలు 2017, రు.19.23 లక్షలు 2016, రు. 8.58 లక్షలు 2015, రు. 9.69లక్షలు 2014.
ఆయనకు నాలుగు బంగారు ఉంగరాలున్నాయి. వాటి బరువు 45 గ్రాములు, విలువ రూ.1,13,800.
అదే 2014 నాటి ఎన్నికల అఫిడవిట్లో నగదు రూ.32,700 ఉంటే బ్యాం క్ బ్యా లెన్స్ ను రూ.26.05 లక్షలుండింది., ఫిక్స్ డ్ డిపాజిట్లు రూ.32.48 లక్షలుండేవి. తన మీద దేశం లో ఎక్కడా తనపై క్రిమినల్ కేసులు లేవని మోదీ అడవిట్ లో చెప్పుకున్నారు.
ఇక చదువుకు సంబంధించి 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుం చి డిగ్రీ చేశారు. 1983లో అహ్మదాబాద్ గుజరాత్ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.