శ్రీలంకలో 290 మందిని చంపి నరమేధం సృష్టించిన సంస్థ పేరును ప్రభుత్వం వెల్లడించింది. ఇది ముస్లిం తీవ్రవాద సంస్థ చేసిన పని అని పేర్కొంది. అయితే, అది దేశీయ సంస్థ.
రెండు రోజుల కిందట, ఈస్టర్ రోజున, మూడుచర్చిలు, మూడు హోటళ్లతో పాటు మొత్తం ఏడు చోట్ల బాంబులు పేల్చి 290 మందిని దుండగులు హతమార్చిన సంగతి తెలిసిందే.
ఈ సంఘటన వెనక వున్నది ఒక శ్రీలంక లో పనిచేస్తే ఇస్లామిక్ సంస్థ అని శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది.ఈ దాడిలో మొత్తం ఏడుగురు ఆత్మహుతి తీవ్రవాదులు పాల్గొన్నారు. ఇందులో 31 మంది విదేశీయులు చనిపోయారు. మృతుల్లో ఎనిమిది మంది భారతీయులున్నారు
సాధారణం అంతర్జాతీయతీవ్ర వాదసంస్థలు దాడికి బాధ్యత స్వీకరిస్తూ ప్రకటన చేస్తాయి.అ యితే, శ్రీలంక దాడికి ఎవరూ బాధ్యత తీసుకోలేదు.
ఈ లోపు శ్రీలంక ప్రభుత్వం 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్టులనేపథ్యంలో నేషనల్ తాహీద్ జమాత్ (National Tawheed Jamath NTJ) అనే దేశీయ సంస్థ ఈదాడి వెనక ఉందని ప్రభుత్వం అనుమానిస్తున్నది.
ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార ప్రతినిధి రజితా సేనెరత్నే వెల్లడించారు.
ఆత్మహుతి దళ సభ్యులంతా శ్రీలంక దేశీయులే.
వీరి సంస్థకు ఏదయిన అంతర్జాతీయసంస్థ నుంచి ప్రోత్సాహం ఉందా అనే కోణాన్ని శ్రీలంక ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నది.