ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు అమ్మాయి తరపు బంధువులు నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని నవ దంపతులు కే యువరాజు, బి ఉష పోలీసులను కోరుతున్నారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు గ్రామానికి చెందిన తాము మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని ఇష్ట పూర్వకంగా తాము వివాహం చేసుకున్నామని వారు తెలిపారు.
అయితే, అమ్మాయి తరపు బంధువులకు ఈ వివాహం ఇష్టము లేకపోవడంతో తమను, అబ్బాయి తరపు కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాము విజయవాడలో డిజిపిని కలిసి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని వినతి పత్రం అందజేశారు.
నవ వధువు ఉషా మాట్లాడుతూ తాను ఇష్టపూర్వకంగానే పెళ్ళి చేసుకున్నానని ఇంట్లోవారికి ఈ పెళ్లి లేక ఇష్టం లేక ఊరి పెద్ద అయిన జనార్ధన నాయుడిని కలిసి తమను విడదీయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆయన మమ్ములను చంపేస్తామని బెదిరిస్తున్నాడని తాము వయసు రీత్యా మేజర్లమని డిగ్రీ పూర్తి చేసి ఉన్నామని, అయితే యువరాజు తనను కిడ్నాప్ చేసినట్లు మా బంధువులు అబద్ధం చెబుతున్నారని తెలిపారు.
తాము ఏప్రిల్ 17న పులివెందుల లో ఒక దేవాలయంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా వివాహానికి సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. మమ్ములను ఊర్లోకి వస్తే చంపేస్తామని ఎవర్ని కలవడానికి వీలు లేదని ఆంక్షలు విధించారని ఆందోళన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో తాము విజయవాడ చేరుకుని మీడియాని ఆశ్రయించడం జరిగిందని పేర్కొన్నారు. తమకు ఏదైనా హాని జరిగితే ఇళయ వాణి, గౌతమ్ కుమార్, అరవింద కుమార్, ఏ సుధా రాణి, భాను చంద్ర బాధ్యత వహించాలని హెచ్చరించారు.ప్రాణహాని నుంచి మీడియా రక్షించాలని నవ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.