హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం నాడు ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల కిందట ప్రకటించిన ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించారు.ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలిసేందుకు వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.అయితే వారికి కార్యదర్శి అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి.దీంతో ఆందోళన దిగిన ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో గందరగోళం, విద్యార్థుల ఆత్మహత్యలపై తక్షణమే సీఎం కేసీఆర్, కేటీఆర్ స్పందించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.