జెడి ఎస్ నాయకుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హ్యాపిగా ఉన్నదెపుడు?
2018 మే 23 న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు ఏడాది అవుతూ ఉంది. ఈ కాలంలో ఆయన కంటతటపెట్టని రోజు లేదు.
కుమారస్వామి ముఖ్యమంత్రి గా హైదరాబాద్ అక్బరుద్దీన్ కు, ఆంధ్ర పవన్ కల్యాణ్ కు ఆదర్శమయిన సంగతి చూశాం.
అసెంబ్లీలో మూడో స్థానంలో ఉన్న కుమారస్వామే ముఖ్యమంత్రి అయినపుడు మనమెందుకు కాకూడదని ఎఐఎంఐఎం సెకండ్ ఇన్ కమాండ్ అక్బరుద్దీన్ చాలా సార్లు అన్నారు. అంతేకాదు, ఒకవేళ అలాకాకపోతే, ఎవరూ ముఖ్యమంత్రయినా ఎంఐఎం దయాదాక్షిణ్యాల మీద ఆధార పడాల్సిందే అన్నారు. ఈ రెండు నెరవేరలేదు, కాకపోతే, కొన్నిబలమయిన కారణాల వల్ల ఎంఐఎం కు తెలంగా ప్రభుత్వంలో అప్రకటిత ‘స్పెషల్ క్యాటగరి స్టేటస్’ వచ్చింది.
Read This also
https://trendingtelugunews.com/jersey-an-emotional-journey-movie-review/
ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే, ఆయన క్యాంపెయిన్ లో ఎపుడూ చెప్పిందిదే. కుమారస్వామి (అసెంబ్లీలో మూడో స్థానంలో ఉన్న) ముఖ్యమంత్రి అయినపుడు తనేందకు కాకూడదని చెప్పని రోజులేదు, చప్పట్లు రాలని సభ లేదు. ఇలా రోజూ కోడై కూయడం వల్ల ఆయనకు తాను బయటకు చెబుతున్న రహస్యం అర్థం కావడం లేదు. తనకు ఆంధ్రలో మూడోస్థానం వస్తున్నట్లు అంగీకరించడమే కదా.
మూడో స్థానం రావడానికి హంగ్ అసెంబ్లీయే ఏర్పడాల్సిన పనిలేదని పవన్ కల్యాణ్ కు ఎవరు చెప్పాలి.
కొత్త గా పార్టీ వాళ్లకి మొత్తం సీట్లన్ని వూడ్చేసుకుని అధికారంలోకి రావాలనుకుంటారు. దీనికి భిన్నంగా మూడో స్థానంలో వచ్చి కుమారస్వామిలాగా ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నది ఒక్క పవర్ స్టారే.
సరే, ఇది వేరే విషయం. అసలు విషయం, కుమారస్వామికి ముఖ్యమంత్రి అయినప్పటితనుంచి కంటి మీద కునుకు లేదు. కన్నీరు ఆరింది లేదు.
పదవి వూడిపోతుందేమోననే భయం వెంటాడుతూ ఉంది. ఆపరేషన్ కమల్ పేరుతో బిజెపి ఆయనను బాగా జడిపించింది. కుమారస్వామిని కాంగ్రెస్ పార్టీ క్లర్క్ లాగాచూస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నపుడు నిజమేనా అని అనుమానంతో చాలా కాలం కుమిలిపోయారు.
ఈ దశ గడిచాక లోక్ సభ ఎన్నికలొచ్చాయి. ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తన కొడుకు నిఖిల్ కుమారస్వామి(సినిమారంగంలో ఫెయిల్ )ని ఎంపి చేసి పార్లమెంటుకు పంపించాలనుకున్నాడు. యాక్టర్ సుమలత అడ్డం పడుతూ ఉంది.
సరే ఇపుడు మరొక కొత్త సమస్య వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు. వారి ద్దరు గెలిస్తే అసెంబ్లీలో కుమారస్వామి బలగం తగ్గిపోతుంది. గెలవాలనేగా పోటీచేసేంది. ఇది కాకుండా మరొక రెండుచోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలున్నాయి. అక్కడ బిజెపి గెలిస్తే బలం ఇంకా తగ్గిపోతుంది. అపుడు బిజెపి అసెంబ్లీలో బలపరీక్ష జరపాల్సిందే అంటుంది.
కర్నాటక అసెంబ్లీలో 224 స్థానాలున్నాయి. జెడిఎస్ కాంగ్రెస్ ల ఉమ్మడి సంఖ్య 118. 113 ఉంటేనే ప్రభుత్వం నిలబడుతుంది. బిజెపి సంఖ్య 104. అధికారం పక్షం లోని కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు సిఎస్ శివల్లి చనిపోయారు. ఉమేష్ జాదవ్ రాజీనామా చేశారు. మే 19 ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలున్నాయి. ఈ రెండు స్థానాలలో బిజెపి గెలిస్తే ఆ పార్టీ బలం 106 కు చేరుతుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో శివల్లి చేతిలో బిజెపి అభ్యర్థి వోడిపోయింది కేవలం 634 వోట్లతోనే. అందుకే శివల్లి స్థానం కుండ్ గోల్ తనదే నని బిజెపి ధీమాతో ఉంది.
పరిస్థితి ఇలా ఉన్నపుడే కాంగ్రెస్ ఇద్దరు ఎమ్మెల్యలను క్రిష్ణ బేరే గౌడ, ఈశ్వర ఖండ్రే అను ఎంపిలుగా నిలబెట్టడమేమిటో? వీరిద్దరు గెలిస్తే… అసెంబ్లీలో రెండు సీట్లు తగ్గిపోతాయి. అసెంబ్లీ సీట్లు 222 అవుతాయి. అపుడు సింపుల్ మెజారిటీ 112 అవుతుంది.
కాంగ్రెస్ వీక్ అయ్యే కొద్ది అసమ్మతి ఎమ్మెల్యేలు బిజెపి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొంతమంది బిజెపి తో సంప్రదింపులలో ఉన్నారని చెబుతున్నారు. రమేష్ జర్కి హోలి( గోకక్),కుమథల్లి (అధాని), బి నాగేంద్ర (బెళ్లారి), .జె ఎన్ గణేష్ (కంప్లి) ల మీద అనుమానాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
లోక్ సభ ఫలితాలు కర్నాటక రాష్ట్ర రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తాయని, కుమారస్వామిని మరింత మనశ్వాంతి లేకుండా చేస్తాయని కర్నాటక రాజకీయ పండితులు చెబుతున్నారు.