ఆదివారం ఈస్టర్ నాడు శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లో 200 మందికి పైగా చనిపోయారు. సుమారు 450 మంది గాయపడ్డారు.
బాంబు పేలుళ్లులో గాయపడిన వారందరిని కొలంబో నేషనల్ ఆసుపత్రికి తరలించారు.
ఆదివారంనాడు మొత్తంగా 8 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. మూడు చర్చీలు, మూడుహోటళ్లు టార్గెట్ గా బాంబులను పేల్చారని అదాదెరన వెబ్ సైట్ పేర్కొంది. ఒక్క కొలంబోల జరిగిన పేలుళ్లలోనే 40 మంది చనిపోయారని అధికార వర్గాలు చెప్పాయి. మొత్తగా 8చోట్ల జరిగిన పేలుళ్లలో 200 ల మందికి పైగా మరణించారు.
ఇది ఇలా ఉంటే నెగాంబో లోని కతువపితియ చర్చిలో జరిగిన పేలుళ్లలో మరొక 35 మంది గాయపడ్డారు. పేలుళ్ల కు సంబంధించినఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.
బట్టికలోవా లొని జియాన్ చర్చిలో జరిగిన పేలుళ్లలో సుమారు 30 మంది గాయపడ్డారు. వారందనిరి అక్కడి ఆసుపత్రిలో చేర్చారు.
ఇదే విధంగా కొతహేన చర్చిలో కూడా పేలుళ్లు సంభించాయి. హోటళ్లకు సంబంధించి కొలంబోలోని షాంగ్రిలా, సినమాన్ గ్రాండ్,కింగ్స్ బరీ హోటెల్ లలో కూడా పేలుళ్లు జరిగాయి.
ఈస్టర్ రోజున క్రైస్తవులు పెద్ద ఎత్తున సందర్శించే హోటల్లివి.
ఈస్టర్ ప్రార్ఘనలు జోరుగా సాగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభించాయి.