మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్ – శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ సమీపంలో ఉంటుంది సలేశ్వరం క్షేత్రం. దీనికి తెలంగాణ అమర్ నాథ్ అని పేరుంది. ఏడాదిలో నాలుగు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలోకి భక్తులను అనుమతిస్తారు. మన్ననూర్ నుంచి 12 కి.మీ సలేశ్వరం లోయలోకి దారి చూపే బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి మరొక 10 కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం లోయ కనిపిస్తుంది. ఇక్కడి దాకా వాహనాలలో రావచ్చు. తర్వాత లోయలో కాలినడకే ఐదు కిలోమీటర్లు ప్రయానిస్తే ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుందీ క్షేత్రం. ఇక్కడ లోయలో వున్న గుహలో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఈ నాలుగు రోజులలోనే దేవదేవుని సందర్శించాలి కాబట్టి పెద్ద సంఖ్యలో జనం వస్తారు. ఈ సారి యాత్రను ఏప్రిల్ 17 నుంచి 21 దాకా అనుమతించారు. ఈ సారి కూడా జనం పెద్ద సంఖ్యలో రావడంతో తొక్కిసలాటకు దారి తీసింది. అడవి లో భారీ గా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు, ఫారేస్ట్ అధికారుల, ఐటిడిసి అధికారుల మధ్య సమన్వయం లోపం వల్ల భక్తులకు నరకం చూపించారు. భక్తుల గోడు చేప్పుకోవడానికి మీడియా కవరేజ్ కూడా లేదు. దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి మీడియా కూడా శ్రద్ద చూపలేదు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/saleshwaram-is-telangana-amarnadh/