లాటిన్ అమెరికాలోని పెరు అధ్యక్షుడు ఎలన్ గార్షియా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్న గార్షియాను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చినపుడు ఆయన తలలో రివాల్వర్ తో కాల్చుకున్నారు.
ఈ సంఘటన ఏప్రిల్ 17 వ తేదీన జరిగింది. ఆయనను వెంటనే అసుప్రతికి తరలించారు. ఆయనను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొద్ది గంటల్లోనే రాజధాని లీమాలో బుధవారం నాడు ఆయన చనిపోయినట్లుప్రభుత్వం ప్రకటించింది.
Consternado por el fallecimiento del ex presidente Alan García. Envío mis condolencias a su familia y seres queridos.
— Martín Vizcarra (@MartinVizcarraC) April 17, 2019
గార్షియా చనిపోయినట్లు దేశాధ్యక్షుడు మార్టిన్ విజ్ కారా ట్వీట్ చేశారు (పైన).
పెరు అవినీతిలో ఓలాలాడుతూ ఉంది. దేశంలో సజీవంగా ఉన్న ప్రతిమాజీ అధ్యక్షుడు అవినీతి కుంభకోణాల్లో పీకలదాకా ఇరుక్కుని ఉన్నారు.
బ్రెజిలియన్ కన్ స్ట్రక్షన్ కంజెనీ ఒడెబ్ రెస్ట్ నుంచి లక్ష డాలర్లు ముడుపు తీసుకున్నట్లు ఎలన్ గార్షియా మీద ఆరోపణ వచ్చింది.
ఈ డబ్బును ఆయన స్వీకరించిన మాట నిజం. బ్రెజిలియన్ వ్యాపారవేత్తలకు ఒక ఉపన్యాసం ఇచ్చేందుకు పరిహారంగా ఈ సొమ్ము తీసుకున్నారు.
అయితే, అది పరిహారం కాదని, దేశంలో పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్టులను ఇచ్చినందుక ఒబెద్ రెస్ట్ ఆయనకు ఇచ్చిన ముడుపులనితేలింది. దీని మీద ఆయనను పోలీసులు అరెస్టు చేయాలనుకున్నారు.
పెరూవియన్ అప్రిస్టా పార్టీ తరఫున ఆయన రెండు సార్లు దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొదటిసారి 1985-1990 మధ్య, రెండో సారి 2006-2011 మధ్యదేశాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తండ్రి కూడా ఈ పార్టీనాయకుడే.