భారతదేశంలో ఉన్న ఒక ఎంపి పార్టీ లలో ముఖ్యమయింది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటయిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం). ఈ పార్టీకి ఎపుడూ ఒకటి మించి ఎంపిలు లేరు. పూర్వం సలావుద్దీన్ ఒవైసీ ఎంపి గా ఉండేవారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపిగా ఉంటున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటి వాళ్ల సంస్థానం. వాళ్ల ఎమ్మెల్యేల సంఖ్య పెరుగదు. వాళ్లు కూడా హైదరాబాద్ దాటి తెలుగు రాష్ట్రాల్లో విస్తారించాలనుకోరు. హైదరాబాద్ పాత బస్తీ మీద అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరద్దీన్ ఒవైసి (ఎమ్మెల్యే)ల పట్టు అంతా ఇంతకాదు.
దేశంలో వాళ్లంత తెలివిగా రాజకీయాలాడుతున్నచిన్న పార్టీమరొకటి కనిపించదు.
పూర్వం వాళ్ల ఇలాకాలోకి మరొకరు ఎవరూ ప్రవేశించకుండా వాళ్ళకి కాంగ్రెస్ అండగా ఉండింది. వాళ్లు కూడా ఇతర ప్రాంతాలలో పోటీ చేసి కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే వాళ్లు కాదు.
ప్రత్యేక రాష్ట్ర వచ్చాక వాళ్లకి రూలింగ్ టిఆర్ ఎస్ అండగా ఉంది. ఈబంధం చాలా పటిష్టంగా ఉంది. కొత్తరాష్ట్రం, కొత్త పార్టీ కాబట్టి ఎఐఎంఐఎం తో అనుబంధం మేలని టిఆర్ ఎస్ బలంగా నమ్మింది. వోల్డ్ సిటీలో తమ సామాజిక,ఆర్థిక, సంస్కాృతిక పట్టు కొనసాగాలంటే టిఆర్ ఎస్ కు బేషరతుగా మద్దతు ఇవ్వాల్సిందేనని ఎంఐఎం భావించినట్లుంది. ఈ బంధం చాలా దూరం వెళ్లింది. ఇపుడు అసదుద్దీన్, మనస్ఫూర్తిగానో లేక పరాచికానికోగాని, దేశానికి సరైన ప్రధాని మంత్రి కెసియారే అంటున్నారు.
మొన్నామధ్య మహబూబ్ నగర్ జిల్లా భూత్ పూర్ లో బహిరంగ సభలో మాట్లాడుతూ కెసిఆర్, ఎంఐఎం లమధ్య ఉన్న అలయన్స్ ప్రజల కోసం కాదు, ఆ రెండు కుటుంబాల (కెసిఆర్, ఒవైసీ) కోసమని ప్రధాని నరేంద్రమోదీ కొంత ఘాటుగానే చురకలేశారు. ఇది బిజినెస్ అనుబంధమని కూడా ఆయన అన్నారు.
ఇదేదో ఎన్నికల ప్రచారం విసురే తప్ప సీరియస్ తీసుకోవలసిన విమర్శ కాదు. ఎందుకంటే, కెసియార్ ద్వారా అసదుద్దీన్ బిజెపికి కూడా స్నేహితుడయ్యడని కెసియార్ విమర్శకులు చెబుతుంటారు. అందుకే మోదీ ప్రభుత్వం అసదుద్దీన్ ఎన్ని వవ విమర్శల చేసినా ఏ మాత్రం సీరియస్ గా తీసుకోదు.
ప్రధాని మీద జోక్ వేశారనో, వ్యంగ్య చిత్రం గీశారనో పోలీసులు సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేయడం, కేసులుపెట్టడం చూశాం. మోదీ మీద దేశంలో ఎవరూ చేయనంతటి తీవ్రవిమర్శలు చేసేదే అసదుద్దీనే.
అంతేకాదు, వాళ్ల ప్రసంగాలలో ఎంత తీవ్రంగా, పదునుగా, భావోద్వేగంతో ఉంటాయో అందరికీ తెలిసిందే. అసదుద్దీన్ ట్వీట్లు ఫాలో అయ్యే వారికి అసద్ ఎంతపదును ట్వీట్లను వదులుతుంటారో అర్థమవుతుంది. అదే ఏవరైనా రాజకీయ పలుకుబడిలేని వ్యక్తి చేస్తే ఈ పాటికి సెడిషన్ (దేశద్రోహ నేరం) మోపి జైల్లో వేసేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎపుడూ ఆయన ట్వీట్లను నేరంగా చూడలేదు.
దీనికి చిత్రమయిన కారణం ఉంది. కెసియార్ బయట బిజెపిని ఎంత తిట్టినా రేపు కేంద్రంలో మోదీ అధికారంలోకి వస్తే కొత్త మిత్రుడయ్యేది ఆయనే అని అందరికి తెలుసు. కెసియార్ బిజెపితో చేతులు కలపడానికి ఎంఐఎంకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే, ఎంఐఎం చిన్నకోరిక, పాత బస్తీ పుట్టలో ఎవరూ చేతులు పెట్టకపోతే సరి. టిఆర్ ఎస్ , మోదీతో కలిస్తే మేం టిఆర్ ఎస్ కు దూరమవుతామని అసదుద్దీన్ ఎలాగూ అనడని బిజెపికి బాగా తెలుసు. అంతేకాదు, ఎఐఎంఐఎం వల్ల బిజెపికి చాలా ప్రయోజనం ఉంది.
బిజెపిలో కూడా ముస్లింలున్నారు. షా నవాజ్ హుసేన్ మాజీ మంత్రి . అలాగే ముక్తార్ అబ్బాస్ నక్వీ అనే సీనియర్ నాయకుడు కూడా ఉన్నాడు. ఇలాంటి కాషాయ ముస్లింలు చేయలేని పని హైదరాబాద్ ముస్లిం నేత చేసిపెట్టగలరని బిజెపికి తెలుసు.
ఎందుకంటే, బిజెపికి పరోక్షంగా తోడ్పడే శక్తివంతయిన మతావేశ భాష మాట్లాడేశక్తి ఒవైసీసోదరుకులకు మాత్రమే వుంది. పూర్వం కేరళ ముస్లింలీగ్ నాయకుడు బన్నత్ వాలా పార్లమెంటులో ఉండేవారు. ఆయనది కూడా సింగిల్ ఎంపి పార్టీయే. ఆయన మేధావి. మంచి వక్త. కేరళ నుంచి వచ్చాడు కాబట్టి ఆయనలో మతావేశం అంతగా ఉండేది కాదు. కాక పోతే, ఆయన బిజెపి వ్యతిరేకి. చక్కటి ఇంగ్లీష్ ప్రసంగం చేసేవాడు.
అలా కాకుండా ఒవైసీ సోదరుల బిజెపి వ్యతిరేకతో ఒక ప్లాన్ ఉంటుంది.
వాళ్లిద్దరు కూడా మంచి పార్లమెంటేరియన్లు. మంచి వక్తలు. వాళ్ల వాదనలో పస ఉంటుంది. అయతే, బిజెపి హిందూ వాదాన్ని విపరీతంగా తిట్టి ముస్లింలను ఆకట్టుకుకే వశీకరణ విద్య వారికి తెలుసు. అదే బిజెపికి కావాలి. అందుకే అసదుద్దీన్ జోలికి మోదీ ప్రభుత్వం రాదు. నిజానికి అసద్ మాట్లాడే భాషలో ఇంకొకరు 10 శాతం మాట్లాడినా ఈ పాటికి జైలులో ఉండాలి. అన్ని రాజకీయ పార్టీల నేతల వ్యాపారాలమీద ఇడి, ఇన్ కం టాక్స్ దాడులు జరగుతున్నాయి. మీరెపుడైనా ఎంఐఎం వ్యాపార మిత్రుల లేదా ఎమ్మెల్యేల ఇళ్ల మీద ఇలాంటి దాడుల వార్తలు చదివారా?
అలాంటి దాడులు పాతబస్తీ లో జరగవు.. ఎందుకంటే, కెసియార్, ఎఐఎంఐఎం,బిజెపి ల అనుబంధం టూ వే ట్రాఫిక్ లాగా కనిపిస్తుంది. బిజెపికి ఎంఐఎం ‘ప్యారా దుష్మన్’(Pyara Dushman) అని రాజకీయ విశ్లేషకుడు ఎస్ బి భాస్కర్ వర్ణించారు.
మిత్రుడి మిత్రుడు మిత్రుడే కదా?
ఎందుకంటే, ముస్లింలో భావోద్వేగాలు తీసుకురావడంలో ఇప్పటికి దేశంలో అసద్ మించిన వక్త లేరు. ఫరూక్ అబ్దుల్లా కుటుంబం ఉన్నా వారికి కాశ్మీర్ బయట అంతపలుకుబడి లేదు. దానికి తోడు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కి ముస్లింలను ఐక్యం చేసే భాష లేదు. వాళ్లు కాశ్మీర్ కే పరిమితమయ్యారు. దానికి తోడు బిజెపి వ్యతిరేక కూటమిలో చేరేందుకు వెనకాడరు. ఎంఐఎం అలాంటి పని చేయదు.
అందువల్ల బిజెపి వ్యతిరేక వోట్లను చీల్చే శక్తి ఎంఐఎం కు ఉన్నంత మరొక ముస్లిం పార్టీకి లేదని బిజెపి నమ్మకం.
బీహార్, మహారాష్ట్రలలో ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టిన చోటల్లా ముస్లిం వోట్లు ఎక్కుగానే ఉంటాయి. ఎంఐఎం అభ్యర్థి ఉన్నందున ముస్లిం వోట్లు చీలిపోతాయి. అది బిజెపికి లాభిస్తుంది. అందుకే బీహార్ సిమాంచల్ లోగాని మరొక చోట గాని ఎంఐఎం కు పడేవోటు మోదీపడే వోటే అని చెబుతారు రాజకీయ పండితులు. అలా ఎంఐఎం కత్తి రెండువైపులా పదునే…