తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలిశారు. పార్టీ ప్రతినిధి వర్గంతో మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలిసితెలుగుదేశం ప్రభుత్వం అరాచకాల మీద ఫిర్యాదు చేశారు.
నిన్న నే పార్టీ ఎంపి విజయ్ సాయి రెడ్డి నాయతకత్వంలో ఒక బృందం ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలసి ఇదే ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పోలింగ్ ముగిశాక వైసిపి పార్టీ కార్యకర్తలమీద, నాయకుల మీద వైసిపికి వోటేసిన వారి బమీద టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని జగన్ గవర్నర్‌కు వివరించారు.
వైఎస్ జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు జంగ కృష్ణమూర్తి, ఆదిమూలపు సురేష్, గోవర్ధన్ రెడ్డి, రామకృష్ణరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీకాంత్‌రెడ్డి, అవంతి శ్రీనివాస రావు, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ ట్రెండింగ్ స్టోరీ చదవండి…
https://trendingtelugunews.com/trs-new-sketch-for-local-body-elections/