ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అవినీతి మీద గుస్సా అవుతున్నారు.తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రం చేయాలనుకుంటున్నారు.
అంతేకాదు, రెవిన్యూశాఖలో చాలా అవినీతి ఉందని ఆయన భావిస్తున్నారు. అసలు ఈ శాఖనే ఎత్తే స్తే పోలా అన్నది ఆయన అభిప్రాయం, దీనిని చాలా స్పష్టం, నిర్మొహమాటంగా చెప్పారు. దీనితో రెవిన్యూ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
తాము అవినీతి పరులం కాదని, గతం మర్చి పోండి, ఇక ముందు అవినీతి ఉండదని ప్రజలకు నచ్చ చెప్పాలనుకుంటున్నారు. ఈ విషయంలో మునుగోడు అందరికంటే ముందుంది. ఏకంగా వాళ్లు తమ ఆఫీసు అవినీతి కార్యాలయం కాదని ప్రకటించేశారు. ఏలాగో తెలుసా?
తహసీల్దార్ కార్యాలయంలో ’అవినీతి రహిత కార్యాలయం’ ఏకంగా బోర్డు ఏర్పాటు చేశారు.
ఇటీవల పలుమార్లు రెవెన్యూ సిబ్బందిని అవినీతిపరులని ముఖ్యమంత్రిఅనడం, ప్రజల్లో కూడా అదే భావం బాగా నాటుకుపోవడంతో తాము అవినీతికి పాల్పడమని వారు ప్రకటించారు.
దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరుతూ కార్యాలయంలో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి పెట్టారు.
ఇలా ఒక ప్రభుత్వం కార్యాలయం ముందు ‘ఈ ఆఫీసు అవినీతి రహిత కార్యాలయం’ అని బోర్డు పెట్టడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదేమో.
ఎవరైనా లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా బోర్డులో స్పష్టంగా రాశారు. ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు.
‘ప్రజలు ఎవ్వరు రెవెన్యూ సేవలకు డబ్బులు ఇవ్వ వద్దు. మీ యొక్క ప్రతి దరకాస్తును తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించబడును. వి.ఆర్.ఏ, .విఆర్ వొ నుండి సిబ్బంది వరకు ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు నెంబర్లు :
తహశీల్దార్ : 9985021455
డిప్యూటీ తహశీల్దార్ : 8897425084
ఒక వేళ మేము అడిగితే ఫిర్యాదు నెంబర్లు:
శ్రీయుత జిల్లా కలెక్టర్ నల్గొండ: 9985915001
ఆర్ డివొ నల్గొండ: 9985915004
తహశీల్దార్ మునుగోడు మండలం.
ఈ ట్రెండింగ్ స్టోరీ చదవండి…
https://trendingtelugunews.com/trs-new-sketch-for-local-body-elections/