ఒకనాటి హీరోయిన్ ఇపుడు బిజెపి తరఫున పోటీ చేస్తున్న జయప్రద గురించి అసభ్యకరమయిన వ్యాఖ్యలు చేసినందుకు ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజావాది పార్టీ అభ్యర్థి ఆజంఖాన్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకపుడు జయప్రద, ఆజంఖాన్ దోస్తులే. అవి సమాజ్ వాది పార్టీ మంచి రోజులు. అపుడు ఆజంఖాన్ మంత్రి. జయపద్రను రాంపూర్ లోక్ సభ సభ్యురాలు. ఆమెను రామ్ పూర్ నియోజకవర్గం నుంచి గెలిపించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు.
తర్వాత్తర్వాత వీళ్లిద్దరువిడిపోయారు.
జయప్రద పార్టీ వదిలేశారు. కొద్ది రోజులు నోటి దురుసు వల్ల ఆజంఖాన్ ను సస్పెండ్ చేశారు. తర్వత ఖాన్ మళ్లీ ఎస్ పిలో చేరారు. జయప్రద బిజెపిలో చేరి రామ్ పూర్ నుంచే పోటీ చేస్తున్నారు. ఇపుడామె ప్రత్యర్థి ఆజంఖానే.
వీళ్లిద్దరి మధ్య చాలా కాలంగా వైరం భగ్గున మండుతూ ఉంది. గతంలో ఇద్దరు బాగా తిట్టుుకున్నారు. జయప్రదను డ్యాన్స్ గర్ల్ అని ఆజం ఖాన్ తిట్లుతిన్నారు. అందుకే ఆపుడు ఆయన్ను పార్టీ నుంచి గెంటేశారు. ఇపుడు మళ్లీ ఇలాగే అసభ్య వ్యాఖ్య చేశారు. ఈసారి ఆయన మీద బిజెపి ప్రభత్వం ఈ రోజు కేసు కట్టారు.
ఆయనేమన్నారంటే..
ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ జయపద్ర మీద ఆయన అండర్ వేర్ వ్యాఖ్య చేశారు. సభలో అపుడు పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో పాటు అనేక మంది సీనియర్ నేతలు కూడా వేదిక మీద ఉన్నారు. జయప్రద్ వేసుకున్న అండర్ వనర్ ఖాకి రంగుదని ఆయన వ్యాఖ్యానించారు.అయితే, జయప్రద పేరెత్తి ఇలా మాట్లాడకపోయినా, అది స్పష్టంగా ఆమె గురించి చేసిన వ్యాఖ్యయే అని వింటే అర్థమవుతుంది.
రామ్ పూర్ ప్రజలారా, ఉత్తర ప్రదేశ్ ప్రజరాలా, భారతీయులారా, మీకు ఆ వ్యక్తి 10 సంవ్సరాలు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించింది. ఆయితే, ఆ వ్యక్తి అసలు రంగు అర్థం చేసుకునేందుకు మీకు (ఇప్పటికి) 17 సంవత్సరాలు పట్టింది. నాకయితే, 17రోజుల్లో అసలు విషయం తెలిసింది. ఆ వ్యక్తి లోన వేసుకుంటున్న అండర్ వేర్… అది ఖాకి రంగు అండర్ అని కనుక్కున్నా. ’ అని అన్నారు.
(Rampur Waalo, Uttar Pradesh Waalo,Hindustan Waalo, Usski asliyat samajhne mein aapko 17 baras lag gaye. Main 17 dinon mein pehchaan gaya ki inke neeche kaa jo undewear hi, woh khaki rang kaa hai)
అయితే, తాను చేసిన వ్యాఖ్య జయప్రద గురించి కాదని, అది ఢిల్లీలో ఉన్న ఒక వ్యక్తి ని ఉద్దేశించిందని, అది పరోక్షంగా జయప్రద మీద చేసింది కాదని ఖాన్ తర్వాత వివరణ ఇచ్చారు.
ఢిల్లిలో ఉన్న ఉన్న మరొక వ్యక్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య అది. అతనిపుడు జబ్బుపడ్డాడు. తాను 150 రైఫిల్స్ తో వచ్చానని, ఆజంఖాన్ ను చంపేస్తానని అన్నాడు. (ఆయన గురించి నేను మాట్లాడాను. అతని గుంచి చెబుతూ ప్రజలకు అతని గురించి తెలుసుకునేందుకు చాలా కాలం పట్టింది. అయితే, అతను ఆర్ ఎస్ ఎస్ నిక్కర్ వేసుకుంటాడని నేను చాలా తొందరగా కనుక్కున్నా’నని అన్నాను, అని ఆజంఖాన్ వివరణ ఇచ్చారు.
Absolutely disgraceful. #AazamKhan is always abusive and disrespectful towards women. @ncw will take Suo Moto and will send a notice to him. Will request #ElectionCommission to bar him from contesting elections. https://t.co/4SdNIUC3dk
— rekha sharma (@sharmarekha) April 14, 2019
జాతీయ మహిళా కమిషన్ కూడా ఆజంఖాన్ వ్యాఖ్యను తీవ్రంగా పరిగణించింది. ఇది స్పష్టంగా జయప్రద గురించి చేసిన వ్యాఖ్యయే అని కమిషన్ చెయిర్ పర్సన్ రాఖీ శర్మ అన్నారు. కమిషన్ ఖాన్ కు నోటీసు జారీ చేస్తుందని చెప్పారు.