ఓవర్ యాక్షన్ చేసి చిక్కుల్లో పడ్డ టిఆర్ఎస్ లీడర్

ఆయనొక టిఆర్ఎస్ నాయకుడు. ఆయన పేరు వెంకటేష్… ఆయన సతీమణి కీసర సర్పంచ్. అధికార పార్టీ అనుకున్నాడో లేదంటే ఇంకేదనుకున్నాడో కానీ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేశాడు. తుదకు చిక్కుల్లో పడ్డాడు. ఇంతకూ ఎవరా? టిఆర్ఎస్ నేత? ఏం ఓవర్ యాక్షన్ చేసిండు… ఎందుకు చిక్కుల్లో పడ్డారు? పూర్తి వివరాలు చదవండి.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవిఎంలను  మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని భోగారం గ్రామం హోళీమేరీ కళాశాలలో భద్రపరిచారు. అయితే కంటోన్మెంట్ సెగ్మెంట్ కు సంబంధించిన ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లిన వెంకటేష్ సరదాగా ఫొటోలకు ఫోజులిచ్చారు. మంచిగ ఫొటోలు దిగారు. అయితే ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఈవిఎంలు భద్రపరిచే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను ఎన్నికల అధికారులు ఆహ్వానిస్తారు. ఆ సమయంలో వెంకటేష్ అక్కడ ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది.

కట్టుదిట్టమైన భద్రత, మూడంచెలు, ఐదంచెలు భద్రత అని ఈసి అధికారులు చెబుతున్న మాటలన్నీ తూచ్ అన్నట్లు నిరూపించారు వెంకటేష్. అయితే స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి ఫొటోలు దిగడం తప్పు అని ఈసి అధికారులు అంటున్నారు. స్ట్రాంగ్ రూముల్లోకి ఫోన్లు అనుమతి లేదంటున్నారు.
ఈ విషయంలో వెంకటేష్ మీద చర్యలు తప్పవని అధికారులు అంటున్నారు. అయితే ఆయన తీరు మీద పోలీసులు దృష్టి సారించారు. కీసర సిఐ నరేందర్ గౌడ్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. మొత్తానికి ఈవిఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములోకి వెళ్లి ఫోటోలు దిగిన టిఆర్ఎస్ నేత వెంకటేష్ ఇలా చిక్కుల్లో పడ్డారని పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు.
కావాలని చేశారు…
తాను స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో తన ఫొటోలు, వీడియోలు ఎవరో కావాలని తీసి సోషల్ మీడియాలో పెట్టి తనను బదనాం చేస్తున్నారని వెంకటేష్ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు.

ఈ ట్రెండింగ్ స్టోరీ చదవండి…

https://trendingtelugunews.com/2019-elections-create-tension-for-telugu-popular-leaders/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *