వేసవికాలం చిత్ర విచిత్రంగా ఉంది. పగటి పూట భానుడు ఎండలు కక్కుతుండగా రాత్రిపూట వరుణుడు భయపెడుతున్నాడు. ఇద్దరూ కలిసి జనాలను పరేషాన్ చేస్తున్నారు. పగలు భయంకరమైన ఎండలు, రాత్రిపూట ఉరుములు, పిడుగులతో గాలివానలు రావడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.
శుక్రవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అక్కడక్కడా పిడుగులు పడ్డాయి. వరంగల్ లోనూ వర్షం బీభత్సం సృష్టించింది. వరంగల్ లో రైల్వే స్టేషన్ మీద ఉన్న రేకులు గాలివానకు విరిగి పట్టాల మీద పడ్డాయి.
అయితే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ బంకు పక్కనే పొడువైన తాటిచెట్టు మీద పిడుగు పడింది. పిడుగు దెబ్బకు ఆ పచ్చి తాటిచెట్టు మీద మంటలు చెలరేగాయి. దెబ్బకే తాటిచెట్టు నల్లగా మాడిపోయి బొగ్గు అయింది. ఇంకా ఆ మంటలు పక్కనే ఉన్న పెట్రోల్ బంకు మీద ప్రభావం చూపలేదు కాబట్టి ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎండాకాలంలో వర్షాలు వచ్చే సమయంలో ఎత్తైన తాటిచెట్లు, కొబ్బరిచెట్ల కింద ఉండరాదని నిపుణుల మాటలను గమనించి దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది.
కింద తాటిచెట్టు తగలబడుతున్న వీడియో ఉంది చూడొచ్చు.