వైసిపి తరఫు ఎన్నికల ప్రచార వ్యవూహాలను రచించి ఆ పార్టీ ని తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దిన వ్యక్తి ప్రశాంత కిశోర్. దేశంలో ఎన్నికల వ్యూహకర్తగా బాగాపేరున్న ప్రశాంత్ కిశోర్ గురించి చాలా సార్లు జగన్ కూడా సభల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రశాంత్ రాకతో జగన్ పార్టీ మాాటలు, నినాదాలు మారిపోతూ వచ్చాయి. జగన్ ప్రచార ఉధృతితో, వ్యవూహాలతో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ గిజగిజలాడిపోయిందని చెబుతారు.
రాష్ట్రంలో ఇపుడు ఒక చిత్రమయిన పరిస్థితి ఏర్పడింది. వైసిపి గెలిచినట్లు సంబరాలు చేసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి ఓడిపోయినట్లు, ఓటమి కారణాలు ఎన్నికల కమిషన్ అంటూ ఢిల్లీ వెల్లి జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నారు.
పోలింగయ్యే నాటికి 40 నలభై సంవత్సరాల పాలనానుభవం ఉన్న టిడిపి అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో భయం కనపడటం మొదలయింది.
దీనితో ఆయన చివరకు అధికారులతో పాటు, ఎన్నికల కమిషన్ ను ఇవిఎంలను కూడా నిందించే స్థాయికి వెళ్లిపోయారు.
ఫలితం ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఫలితాలువచ్చాక చేయాల్సిన అరోపణలను ఆయన కౌంటింగ్ కూడా మొదలు కాకముందే చేసి ఓటమిని దాదాపు అంగీకరించారు. ఇపుడాయన ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు గొడవ చేయబోతున్నారు.
ఈనేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ జగన్ ను అభినందించారు.
తనకు వైసిపితో కలసి పని చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ జగన్ ఒక మంచి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఇది వీడియో…
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/naidu-intimidating-officials-eas-sarms-writes-to-election-commission/