పాకిస్తాన్ లో ని బాలా కోట్ లో భారత వాయు సేన జరిపిన సర్జికల్ స్ట్రయిక్ ప్రభావం ఏమీ లేదని ప్రపంచానికి చెప్పేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది.
భారత సర్జికల్ స్ట్రయిక్ వల్ల జరిగిందేమిటో మీరే చూడండని చెబుతూ అధికారులు భారతదేశం నుంచి పనిచేస్తున్న అంతర్జాతీయ విలేకరులను, పాకిస్తాన్ లోని విదేశీ రాయబార కార్యాలయాలలోని మిలిటరీ అధికారులను పాకిస్తాన్ మిలిటరీ అధికారులు బాలాకోట్ ప్రాంతానికి తీసుకు వెళ్లారు.
పుల్వామా దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26 న భారత వాయుసేన యుద్ధ విమానాలు పాకిస్తాన్ లోకి చొరబడి అక్కడ తీవ్రవాదూల స్థావరం మీద బాంబులు వేసిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ బాంబు దాడిలో ఎంత విధ్వంసం జరిగిందనే దానిమీద ఇంతవరకు ఏ వైపు నుంచి స్పష్టమయిన సమాచారం లేదు.
మొదట్లో భారత అధికారులు 300 మందికి పైగా చనిపోయారని చెప్పారు.
తర్వాత దాడిజరిగిందని,మేం శవాలను లెక్కించలేమని, నష్టం మోతాదు చెప్పలేమని అన్నారు.
అయితే, అంతర్జాతీయ మీడియా మాత్రం దాడి పెద్దగా నష్టం కలిగించలేదని శటిలైట్ ఫోటోలను చూపించింది.
ఈ లోపు దాడిలో చెట్లు మాత్రం కూలిపోయాయని, అది విధ్వంసం అని పాకిస్తాన్ ఇండియా మీద గ్రీన్ కేసు నమోదు చేసింది. అయితే, ఈ ప్రాంతంలోకి మీడియాను ఇంతవరకు అనుమతించ లేదు.
అయితే, ఇపుడు తొలిసారిగా పాకిస్తాన్ అంతర్జాతీయ విలేకరును బాలాకోట్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడేం జరిగిందో చూపించింది. పాకిస్తాన్ కథనం ప్రకారం అక్కడేమీ నష్టం జరగలేదు. భారత దాడులు గురి తప్పాయన్నది పాక్ వాదన.
అక్కడ ఇటుక పెల్ల కూడా ధ్వంసం కాలేదని పాక్ అధికారులు చెబుతున్నారు. సందర్శకులకు బాంబు లు పడి ఏర్పడిన గోతులను చూపించారు. ఇది జనవాస ప్రాంతం కాదు. ఎడారి లాంటి నిర్జన ప్రదేశమని అధికారులు చెప్పారు.
అధికారులుజర్నలిస్టులను సమీపంలోని ఒక మదర్సాకు కూడా తీసుకెళ్లారు. ఈ మదర్సా మీద దాడి చేసి వందలాది మంది తీవ్రవాదలను హతం చేసినట్లు ఇండియా పేర్కొనడం తప్పని చెప్పేందుకు వారు మదర్సాను చూపించారు. అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు మదర్సాలోని విద్యార్థులతో కొద్ది సేపు ముచ్చటించారు. తర్వాత మీడియా ప్రతినిధులను అక్కడికి సమీపంలో ఉన్న అర్మీ పబ్లిక్ స్కూల్ కు తీసుకెళ్లారు.
బిబిసి ఉర్దు ప్రతినిధి అందించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను ‘పాకిస్తాన్ అధికారులు హెలికాప్టర్ లో బాలాకోట్ ప్రాంతంలోని జబ్బా కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి ఒకటిన్నర గంట కొండల మీద పాకుతూ మీడియా ప్రతినిధులు కొండశిఖరం మీద పచ్చని చెట్ల మధ్య ఉన్న మదర్సా చేరుకున్నారు. అక్కడి కి వెళ్తున్నపుడు భారతీయ విమానాలు వేసిన బాంబుల వల్ల ఏర్పడిన గోతిని కూడా చూశారు. మీడియా ప్రతినిధులు వెళ్లే సమయానికి మదర్సాలో 150 మంది విద్యార్థులు, అంతా 12-13 సంవత్సరాల మధ్య వయసున్నవారు, ఖురాన్ చదువుతున్నారు.
మీడియా ప్రతినిధులత్ పాటు పాకిస్తాన్ లో ఉండే దౌత్యాధికారులను కూడా ఈ ప్రాంతానికి తీసుకెళ్లారు.
అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తమ బాలకోట్ యాత్ర గురించి ఏమి రాస్తారో చూడాలి.
A group of international media journalists mostly India based and Ambassadors & Defence Attachés of various countries in Pakistan visited impact site of 26 February Indian air violation near Jabba, Balakot. Saw the ground realities anti to Indian claims for themselves. pic.twitter.com/XsONflGGVP
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) April 10, 2019
(ఫోటోలు ట్రిబ్యూన్ ఎక్స్ ప్రెస్ సౌజన్యం)