తెలంగాణ సిఎం కేసిఆర్ కొన్ని సందర్భాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ సమయంలో దేశమంతా ఆయన తీసుకున్న నిర్ణయాలపై చర్చోపచర్చలు సాగుతాయి. అలాంటి విషయమే ఇటీవల మంచిర్యాలకు చెందిన యువ రైతు శరత్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఒక సిఎం స్వయంగా రైతుకు ఫోన్ చేసి మాట్లాడడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద బర్నింగ్ టాపిక్ అయింది. కేవలం సోషల్ మీడియాలో చేసిన పోస్టు చూసి ఆ రైతుకు కేసిఆర్ ఫోన్ చేసి మాట్లాడి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ సమస్య అనేక మలుపులు తిరగడం… శరత్ ప్రత్యర్థులు సీన్ లోకి రావడంతో వివాదం రేగింది. సరే ఆ సంగతి అటుంచితే…
తాజాగా సంకసర్ల సువర్ణ అనే మంచిర్యాల యువతి సిఎం కేసిఆర్ స్పందిచాలన్న ఉద్దేశంతో తమ గ్రామ సమస్యను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తమ సమస్య ఏంటి? ఆమె ఆవేదన ఏంటో కింద ఆమె పోస్టు యదాతదంగా ఉంది చదవండి.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి(కేసీఆర్) గారికి,
నా పేరు సువర్ణ సంకసర్ల, నేను మంచిర్యాల జిల్లా,చెన్నూరు నియోజకవరవర్గం, మందమర్రి మండలం,రామకృష్ణపూర్ వాస్తవ్యురాలిని.
విషయం: మా ఊరిలో క్యాతనపల్లి రైల్వే గేట్ దగ్గర ఫ్లై ఓవర్ గురించి.
సార్ మీరు ఇదివరకు మా మంచిర్యాల జిల్లాలో ఒక కుటుంబం భూమి విషయంలో ఇబ్బంది పడుతున్నారని సెల్ఫీ వీడియో పెట్టగానే మీరే స్వయంగా స్పందించారు.అది చూసిన నేను ఈ facebook ద్వారా మా ఊరి ప్రజల సమస్యను మీకు చేరవేస్తున్నాను.
మా రామకృష్ణపూర్ ఫ్లై ఓవర్ కి డబ్బులు వచ్చి రెండున్నర సంవత్సరాలు అయింది. ఒకే ఒక వ్యక్తి తన భూమి పోతుందని కోర్ట్ లో కేస్ వేశాడనే ఒకే ఒక కారణంతో పనులు స్టార్ట్ చేయడం లేదు.అతని సమస్య ఏమిటో, అతనికి ఏమి కావాలో ఏ నాయకులు కూడా కేస్ వేసిన అతని దగ్గరకు వెళ్లి మాట్లాడటం లేదు.ఒకే ఒక వ్యక్తి వల్ల ఊరు మొత్తం ఇబ్బంది పడుతుంది. మా ఊరి ప్రజలు అందరు మంచిర్యాలలో పలు పనులు చేస్తూ బ్రతుకుతున్నాము.మధ్యలో గేట్ పడితే దాదాపు గంట, గంటన్నర దాకా ఆగాల్సి వస్తుంది.మా ఊరిలో హాస్పిటల్ లేదు,డాక్టర్ లేనందున అందరమూ మంచిర్యాల ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తుంది. గేట్ పడటం వలన సమయానికి వైద్యం అందక ఎంతో మంది చనిపోయారు.మాకు మా దగ్గర నాయకుల మీద నమ్మకం పోయింది. ఒక కుటుంబం ఇబ్బంది పడితేనే మీరు స్వయంగా స్పందించారు.ఇంతమంది ఒక ఊరు మొత్తం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు గుర్తించి స్పందిస్తారని,మా ఊరి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము సార్.
సువర్ణ సంకసర్ల
తెలంగాణ ఆడబిడ్డ,
రామకృష్ణపూర్,
మంచిర్యాల జిల్లా.
ముఖ్యమంత్రి గారికి మా ఊరి సమస్య చేరి, స్పందించేవరకు ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్.ముఖ్యమంత్రి గారు స్పందించాక మళ్ళీ పోస్ట్ పెడతాను.అప్పటివరకు మా సమస్యను షేర్ చేసి మాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్.
సువర్ణ రాసిన పోస్టు ఫేస్ బుక్ లింక్ కింద ఉంది.
https://www.facebook.com/170205843396376/posts/671630993253856/?app=fbl