కృష్ణాజిల్లా మచిలీపట్నంలో వైస్సార్సీపీ ఎన్నికల ప్రచారానికి కొద్ది సేపటి కిందట పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. పట్టణంలోని కోనేరు సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసగించారు. బందర్ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడ రేవు కోసం 33 వేల ఎకరాలను సేరించడం వివాదానికి దారితీసింది. అవసరమయిన దానికంటే ఎక్కువ భూముల సేకరించి ప్రయివేటు వారికి అప్పచెబుతున్నారని విమర్శ ఉంది. రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ సేకరణని ఇఎఎస్ శర్మ వంటి మేధావులు, వడ్డేశోభనాద్రీశ్వరరావు వంటి రైతు నాయకులు వ్యతిరేకించారు వాళ్లందరికి జగన్ హామీ ఇచ్చారు. జగన్ నుంచి ఈ హామీ వస్తుందనే జనం విపరీతంగా వచ్చారు.
జగన్ ఉపన్యాసం సంగతేమోగాని,జనం విరగబడి వచ్చారు.వీడియో చూడండి…
జగన్ ఏమన్నారంటే…
నా సుదీర్ఘ 3648 కిమీ పాదయాత్ర మచిలీపట్నం నుంచి కూడా సాగింది. ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి సమస్య నాకు గుర్తుంది. ఇక్కడ పోర్టు వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని అందరూ కల గంటున్న విషయం కూడా చెప్పారు.
ఇక్కడ పోర్టు కోసం దివంగత మహానేత వైయస్సార్ నాడు శంకుస్థాపన చేశారు. అందు కోసం 4800 ఎకరాల భూసేకరణకు కూడా ప్రయత్నించారు. దాన్ని విభేదించిన చంద్రబాబు పోర్టుకు అంత భూమి అవసరం లేదని, కేవలం 1800 ఎకరాలు చాలని వాదించారు.
కానీ చంద్రబాబు సీఎం అయ్యాక అన్నీ మర్చిపోయి ఏకంగా 33 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాత్రికి రాత్రి జీఓ ఇచ్చారు. పరిహారం చెల్లింపులోనూ చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారు. ఆ రైతులందరికీ చెబుతున్నాను. నేను ఉన్నాను. పోర్టుకు 4800 ఎకరాలు చాలు. అంతకు మించి భూసేకరణ అవసరం లేదు. ప్రభుత్వం ఏర్పడితే పోర్టు నిర్మాణం జరుగుతుంది.