ఎన్నికల ప్రచారంలో టీఆరెస్ పై కోదండరాం ఆగ్రహం

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చేవెళ్ల నుండి కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కొండా విస్వశ్వరరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీఆరెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ పార్టీ రాజకీయ ధోరణిని తప్పు బట్టారు. ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.
టీఆరెస్ పార్టీ రెండవ సారి గెలిచి మిగతా పార్టీలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పి పెట్టాలి. ఆ పార్టీ బలహీనంగా ఉన్నందునే వేరే పార్టీలో గెలిచిన నాయకులను తీసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు. మందు, పైసలు ఇస్తే తీసుకుని మంచి నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్ వేయండి అని ఓటర్లకు సూచించారు. ఆలోచన తో ఓట్ వేయమని అభ్యర్ధించారు.
చేవెళ్ల టీఆరెస్ అభ్యర్థి వ్యాపారం కోసం వచ్చిన వాడే కానీ మన బాగు కోసం వచ్చిన వాడు కాదు. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు ఇస్తుంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండ విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్ వేయండి. రంగారెడ్డి జిల్లా బాగు కోసం ఉద్యమం చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్ వేద్దామా? ఇక్కడ భూములు కొనుక్కుని వ్యాపారం చేసే రంజిత్ రెడ్డికి ఓట్ వేస్తారా? మీరే ఆలోచన చేసి ఓట్ వేయండి అంటూ ఓటర్లను కోరారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/congress-sravan-spews-fire-on-trs-mp-candidates/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *