ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఊహించని షాక్ తగిలింది. గత రెండు రోజులుగా ఏపీలో ఒక వార్త హాట్ టాపిక్ అయింది. విజయసాయిరెడ్డి ఆడియో లీక్ అయిందంటూ. ఏపీ ప్రజలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాధాకృష్ణకు సంబంధించిన మీడియా సంస్థల్లో ప్రముఖంగా వచ్చిన వార్త.
టీడీపీ అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీనిపై వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.
వేమూరి రాధాకృష్ణ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు వైసీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి. తన వాయిస్ ని డబ్బింగ్ చేసి తన ప్రతిష్టను, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది ఫేక్ ఆడియో అని, అందులో ఉన్నది తన వాయిస్ కాదని అన్నారు.
కాగా ఈ కేసు బంజారాహిల్స్ పరిధిలోకి వస్తున్నందున కేసును బంజారాహిల్స్ పిఎస్ కి బదలాయించారు జూబ్లీహిల్స్ పోలీసులు. విజయసాయి రెడ్డి తరపున చల్లా మధుసూదన్ రెడ్డి, వైసీపీ ఐటి వింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/india-tv-cnx-survey-results/