నటుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత మోహన్ బాబుకు ఎదురు దెబ్బ తగిలింది.
ఈ మధ్య నే చాలా కాలం తర్వాత క్రియా శీల రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినప్పటినుంచి ఆయన రాజకీయల్లో విలువల గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని ఏకి పడేస్తూ వైఎస్ ఆర కాంగ్రెస్ తరఫున చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయన ఏడాది జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది.
ఒక చెక్‌బౌన్స్ కేసు అంటే మోసానికి సంబంధించినది. మోహన్‌బాబుకు ఇలాంటి కేసులో శిక్ష పడటంతో ఆయన రాజకీయ ప్రచారం కష్టం కానుంది.
జైలు శిక్షతో పాటు రూ.41.75 లక్షల జరిమానా కూడా కోర్టు విధించినది.
2010లో చెక్‌బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్, ఏ2గా మంచు మోహన్‌బాబును చేర్చారు.
రూ. 48 లక్షలు చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్ట్‌కు వెళ్లారు. 2010 సంవత్సరంలో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. ఇప్పటికి తేలింది. తీరాాయన ఎన్నికల ప్రచారంలో జోరుగా ఉన్నపుడు ఈ తీర్పు వచ్చింది.
అయితేే, మోహన్ బాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు.