టిఆర్ఎస్ ఎంపీ అభ్యర్దుల పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ విమర్శల వర్షం కురిపించారు. ఎంపీ అభ్యర్దులంతా భూ కబ్జాదారులు, క్రిమినల్ చరిత్ర ఉవ్నవారేనన్నారు. 15 మంది ఎంపీలు ఉంటే కనీసం విభజన హామీలు సాధించలేకపోయినవారు 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేయగలరని శ్రావణ్ ప్రశ్నించారు. గాంధీ భవన్ లో మాట్లాడిన ఆయన ఏమన్నారంటే…
“టిఆర్ఎస్ 16 మంది ఎంపీ అభ్యర్దులలో చక్రం తిప్పేవారు ఎవరూ లేరు. అంతా భూ కబ్జా దారులే. వారంతా దోచుకోవడమే తప్ప ప్రజలకు ఏం చేయలేరు. కోట్ల రూపాయలు కేసీఆర్ కిచ్చి టికెట్లు తెచ్చుకున్నారు.
ఖమ్మం ఎంపీ అభ్యర్ది నామా నాగేశ్వరరావు పై అత్యాచారం కేసు ఉంది. అతనో ఆర్దిక నేరగాడు. 100 కోట్ల వ్యాపారం ఉన్న కోళ్ల వ్యాపారికి చేవేళ్ల టికెటిచ్చారు. ఉద్యమంలో ఆయన లేనేలేడు. అతనికి టికెటిచ్చారు. అంటే ఇక్కడ పైసనే పని చేసిందని తెలుస్తుంది.
వేం నర్సింహా రెడ్డి నల్లగొండ ఎంపీ టికెట్ ను 100 కోట్లకు కొన్నాడు. అతని పై అనేక భూ కబ్జాలున్నాయి. యతిమ్ ఖానా భూములను నర్సింహా రెడ్డి కబ్జా చేశారు. 100 ల కోట్లు విలువ చేసే భూములను కబ్జా చేసిన వేం నర్సింహారెడ్డి పై చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ఉద్యమ ద్రోహి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుకు ఎంపీ టికెటిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు వివేక్ వెంకటస్వామిని పక్కన పెట్టి వెంకట్ కు ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీ 100 కోట్ల క్లబ్ నడుపుతోంది. భూ కబ్జాల పై చీఫ్ సెక్రటరీకి లేఖ రాసినా దాని పై ఇప్పటికి స్పందించలేదు.
పేదరిక నిర్ములన కోసమే పేద కుటుంబాలకు సంవత్సరానికి 72,000 వేల రూపాయల హమీని రాహుల్ గాంధీ మేనిఫెస్టో లో పెట్టారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రజలు కూడా పని చేసే వారికి పట్టం కట్టాలి కానీ పదవులతో తరాలకు తరగని ఆస్తి కూడబెట్టే వారికి కాదు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం.” అని దాసోజు శ్రవణ్ అన్నారు.