చాలా రోజుల తర్వాత గరుడ వేగ చిత్రంతో ఫామ్ లోకి వచ్చిన టాలీవుడ్ జంట రాజశేఖర్, జీవిత మొత్తానికి మళ్లీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు.
సోమవారం నాడు లోటస్ పాండ్ కార్యాయలయానికి వచ్చి పార్టీ అధితనే అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తర్వాత పార్టీ చేరారు. వారిని పార్టీలో ఆహ్వానిస్తూ జగన్ పార్టీ కండువా కప్పారు. రాజశేఖర్ లది సుదీర్ఘమయిన రాజకీయ యాత్ర. మొదట వారు లక్ష్మీపార్వతితో ఉన్నారు.తర్వాత టిడిపిలో ఉన్నారు. ఆపైన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వారు కాంగ్రెస్ లో చేరారు. ఆయన మరణానంతరం జగన్ ఏర్పాటుచేసిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చారు. తర్వాత ఏవో కారణాలతో పార్టీని వీడారు. వీరు బిజెపిలో కూడా కొన్ని రోజులున్నారు. ఇపుడు మళ్లీ టిడిపిలోకి వెళతారని అనుకుంటున్నపుడు ఆకస్మిక ట్విస్ట్ ఇచ్చి వైఎస్ ఆర్ సిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్టాడుతూ రాజశేఖర్ ఆసక్తికరమయిన విషయాలు చెప్పారు.
గతంలో తాము వైఎస్ ఆర్ సిలో ఉండినమాట, జగన్తో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన అన్నారు. అయితే గతంలో తాము చూసిన జగన్ వేరు ఇప్పుడు కనపిస్తున్న జగన్ వేరు అని ఆయన చెప్పారు.ఎపుడూ విబేధాలతో కొనసాగలేమని కూడా వారు అన్నారు.ఈ అపోహలను తొలగించుకుంటున్నామని చెబుతూ తాను ఆ రోజు కొంత అపరిపక్వతతో వ్యవహరించానని అంగీకరించారు. ‘నాకు ఆయన తో శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు వచ్చాయి. వాటిని పొగొట్టుకొనడానికే ఈ రోజు ఆయన దగ్గరకు వచ్చాము,’ జీవిత రాజశేఖర్ చెప్పారు. అప్పటి ఆయనను కలవడం లో కొంత ఆలస్యం అయిందని కూడా వారు చెప్పారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడయిన జగన్ పులిబిడ్డ అని చెబుతూ భవిష్యత్తు బాగు పడాలంటే జగన్ వోటేయాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కృషి చేస్తామని వారు తెలిపారు.