కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగాను : ఎంపీ కవిత

ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం, ప‌సుపు పంట‌కు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర క‌ల్ప‌న కోసం గ‌డ‌చిన ఐదేళ్లూ కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని తిరిగాన‌ని చెప్పారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌.
 ఆదివారం రాత్రి కోరుట్ల నియోజ‌క వ‌ర్గం  మెట్ ప‌ల్లి మండ‌లం లోని వెల్లుల్ల‌, జ‌గ్గాసాగ‌ర్‌, బండ లింగాపూర్ గ్రామాల్లో జ‌రిగిన రోడ్ షోల‌లో పాల్గొని ప్ర‌సంగించారు.
నిన్న‌టి దాకా మీతో భుజం భుజం క‌లిపి ఉద్య‌మాలు చేసినోళ్లం.. నేను ఎంపిని కాక ముందే ఎన్నో సార్లు ప‌సుపు రైతులు ద‌ర్నాలు, ఆందోళ‌న‌లు చేశారు. ఆనాడే చెప్పాను. ప‌సుపు రైతులు క‌ష్టాలు తీర్చేందుకు కేంద్రంపై పోరాటం చేస్తాన‌ని అని ఎంపి క‌విత తెలిపారు.
 తాను  మేలో ఎంపి ఆయితే…జూన్‌లోనే ప‌సుపు బోర్డు కోసం కేంద్రానికి లేఖ రాశానన్నారు.  ప్ర‌ధానిని క‌లిశాను..మంత్రుల‌ను క‌లిశాను. ఆఖ‌రుకు ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లును పెట్టాను. మా రైత‌న్న‌ల ప్ర‌తినిధిగా వారి గొంతు పార్ల‌మెంటులో వినిపించాను. ఐదేళ్లుగా ఎక్క‌ని కొండ లేదు…మొక్క‌ని బండ లేదు…ప‌సుపు బోర్డును ఇవ్వాల్సింది బిజెపి అని క‌విత స్ప‌ష్టం చేశారు.
2013 లో బిజెపి అనుబంధ రైతు స్వ‌దేశీ జాగార‌ణ్ మంచ్ ప‌సుపు రైతులతో డిల్లీలో ద‌ర్నా చేసింద‌ని క‌విత తెలిపారు. ఆ ద‌ర్నాకు  రాజ్ నాథ్ సింగ్ హాజ‌ర‌య్యార‌ని, తాము అధికారంలోకి వ‌స్తే ప‌సుపు బోర్డు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. కాని ఈ విష‌యం ఆ పార్టీ నేత రామ్ మాధ‌వ్‌కు తెలియ‌ద‌ట‌. మొన్న ఆర్మూర్‌కు వ‌చ్చిన ఆయ‌న ప‌సుపు బోర్డు ఏర్పాటు ను వారి మేనిఫెస్టోలో పెడ‌తామ‌ని చెప్పారు. న‌వ్వాలో..ఏడ‌వాలో తెలియ‌లేదు.
నేనూ, మా ముర‌ళీధ‌ర్ అన్న, ప‌సుపు రైతుల‌తో డిల్లీకి విమానంలో డిల్లీకి పోయినం.. వ్య‌వ‌సాయ శాఖ మంత్రి రాధామాధ‌వ్ ను క‌లిశాం అని చెప్పారు.
ప‌సుపు ఉడ‌క బెట్టేందుకు ఉప‌యోగించే బాయిల‌ర్లు నాలుగు ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు దొరుకుతున్నాయి. రైతుల‌కు అంత ధ‌ర చెల్లించ‌డం క‌ష్ట‌మ‌ని సాగ‌ర‌న్న తో క‌లిసి సిఎం కెసిఆర్ ను క‌లిసి ప‌రిస్థితి చెప్పామ‌ని తెలిపారు. స్పందించిన సిఎం స‌బ్సిడీ ఇద్దామ‌న్నారు. కోరుట్ల‌లో ప‌సుపు బాయిల‌ర్ల‌కు రెండు ల‌క్ష‌ల స‌బ్సిడీతో 100 మంది ప‌సుపు రైతుల‌కు ఇప్పించాను అని క‌విత తెలిపారు. రైత‌న్న‌ల‌తో క‌ల‌సి ఇక ముందూ పోరాటం సాగిస్తా..ప్ర‌జ‌ల‌పై విశ్వాసం ఉంది అందుకే ధైర్యంగా ముందుకు పోతున్నా అని అన్నారు.
డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు కావాల‌ని కోరిక ఉంది ప్ర‌జ‌ల్లో ఉంద‌న్నారు. సొంత జాగా ఉన్న వారికి రూ. 5 ల‌క్ష‌లు ఇస్తామ‌ని సిఎం కెసిఆర్ చెప్పారు. అలాగే వ‌చ్చే ఐదేళ్ల‌లో డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను పూర్తి చేస్తామ‌ని క‌విత చెప్పారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చేది ఎవ‌రు…ఎప్పుడూ మీతో ఉండేది ఎవ‌రో మీరు  అర్థం చేసుకోవాల‌ని కోరారు. కారు గుర్తుకు ఓటిసి త‌న‌ను గెలిపించాల‌ని ఎంపి క‌విత కోరారు.
*మేము సైతం..*
ఎంపి క‌విత‌ను గెలిపించుకునేందుకు మేము సైతం అంటూ వెల్లుల్ల స‌ర్పంచ్ ర‌జ‌నీ తిరుప‌తితో పాటు ఉప స‌ర్పంచ్ లింగారెడ్డి టిఆర్ఎస్ లో చేరారు. వారికి ఎంపి క‌విత గులాబి కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సాగ‌ర‌న్న పిలుపు…క‌విత‌క్క గెలుపు, గెలిపిద్దాం…క‌విత‌క్క‌ను గెలిపిద్దాం..అంటూ యూత్ నినాదాలు రోడ్డు షోలో ప్ర‌తిద్వ‌నించాయి. అంత‌కు ముందు  ఎంపి కవిత‌కు మ‌హిళ‌లు వాయినం ఇచ్చారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగ‌ర్ రావు, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/mohan-babu-says-about-viceroy-hotel-incident/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *