సౌతిండియా ఇడ్లీ గ్లోబలైజయిపోతూ ఉంది. బర్గర్లు, పీట్జాలు,నూడుల్స్ దుమ్ము దుమ్ముగా అమ్ముడు పోతున్నా మన సాంప్రదాయిక ఇడ్లీ హోదా మాత్రం తగ్గడం లేదు.
ఇడ్లీ నే ఇంకా చాలా మంది బెస్ట్ టిఫిన్ అనుకుంటున్నారు. పులిసిన పిండిని ఆవిరిలోఉడికించి చేసే ఈ దూదిముద్ద లాంటి తెల్లటి ఇడ్లీలో ఇతర అన్ని బ్రేక్ ఫాస్ట్ ఐటెమ్స్ కంటే పోషకాలు ఎక్కువ అని ప్రపంచమంతా అంగీకరిస్తున్నారు. అందుకే ఇడ్లీ గ్లోబలైజయిపోతూ ఉంది. వివిధ జాతుల, దేశాల వాళ్ల కోసం అవతారాలే కాదు రంగు రుచి వాసన కూడా మార్చుకుంటూ ఉంది. ఒకప్పుడు ఇండ్లీ సాంబర్ ఫేమస్. ఈపేరు మీద రాజకీయ ఉద్యమాలు కూడా నడిచాయి. ఇడ్లీ సాంబార్ గోబాక్ అనే నినాదం కూడా ఉండి. అది ఎక్కడ,ఎపుడు, ఎందుకొచ్చిందో కనుక్కుని విజ్ఞాన వంతులు కండి.
సౌతిండియా లో పుట్టి పెరిగినా ఇడ్లీ ఆమూల ఈమూల అని కూడా నలుమూలలా విస్తరించి ఇపుడు అంతర్జాతీయ ఇడ్లీ దినోత్సవం (World Idli Day) జరుపుకునే స్థాయికి ఎదిగింది. ఈ రోజే ఆ శుభదినం. గత మూడేళ్లుగా ప్రపంచంలో ఉన్న ఇడ్లీ ప్రియులు అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటూ ఆరోగ్యం కోసం ఇడ్లీ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. వొళ్లుతగ్గాలనుకుంటున్నవాళ్లు, వొంటిని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటున్నవాళ్లు,రోగులు, భోగులు,సాధువులు, సంపన్నులు, పేదలు అంతా ఇష్టపడే సింపుల్ బ్రేక్ ఫాస్ట్ ఇండ్లీయే. ఇడ్లీని ఇడ్లీగా గౌరవిస్తూ తినవచ్చు, వడ అలయన్స్ తో లాగించ వచ్చు, పసికి పొడిచేసి దోసేస్టఫ్ గా చేసుకుని తినవచ్చు.రోస్టు చేసుకోవచ్చు, అవసరమయి ఫ్రే చేసుకోవచ్చు.ఇంకా ఓపిక ఉంటే చద్దీ ఇడ్లీలను ఉప్మా గా మార్చుకోవచ్చు.
ఇండియా ఇడ్లీ వ్యవహారానికి వస్తే ఇండియా సిలికాన్ వ్యాలీ గా పేరున్నా, బెంగుళూరు ఇండ్లీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోంది.
ఊబర్ ఈట్స్ సర్వే ప్రకారం ఇండియాలో ఇడ్లీ ఎక్కువ ఇష్టపడేనగరం బెంగుళూరే.
తర్వాత ముంబై,చెన్నై, పూణే, హైదరాబాద్ లది స్థానం. బిర్యారీ హైదరాబాద్ ఇడ్లీలలో వెనకబడిపోయింది
బెంగుళూరియన్లు ఇడ్లీలను బాగా ఇష్టపడుతున్నారు.అందులో వైవిధ్యం కూడా తీసుకువచ్చారు. తట్టె ఇడ్లీ వాళ్ల పేవరైట్.
పొద్దున 7.30 నుంచి 11.30మధ్య చేసే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ ని ఇష్టపడే వారి సంఖ్యే ఎక్కువ అని ఈ స్టడీ లో తేలింది. ఇపుడిది క్రమంగా ఎపుడైనా తినే వంటగా మారిపోతూఉందని ఊబర్ ఈట్స్ విశ్లేషణ చెబుతూ ఉంది.
ఇడ్లీ ఇటీవల అవతారాలు కూడా మార్చుకుంటూ ఉంది. బెంగుళూరులో ఉత్లీ అనే కొత్త టైప్ ఇడ్లీ ఇపుడు పాపులర్ అయింది. ఇది ఇడ్లీలతో చేసిన బర్గర్ లాంటిది. చికెన్ ఫ్రై ఇడ్లీ, ఇడ్లీ మంచూరియా, చాకొలేట్ ఇడ్లీ, మష్రూం ఫ్రై ఇడ్లీ, ఫ్రెంచ్ ఇడ్లీ.. ఇలా ఇడ్లీ గ్లోబలైజ్ అవుతూ ఉండటం ఊబర్ఈట్స్ సర్వేలో తెలింది. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఈ రోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం.
అంతర్జాతీయంగా చూస్తే శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, న్యూ జెర్సీ ఇడ్లీ ఇష్టపడే గ్లోబల్ నగరాలు.
ఈ రోజు #WorldIdliDay ట్విట్టర్ ట్రెండింగ్ హ్యష్ టాగ్.