వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన హత్యపై అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వివేకా మృతిపై రాజకీయ నేతలు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐకి అప్పగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వివేకా హత్య కేసు విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం వివేకా హత్యకేసు వాదనలు ముగిసిన అనంతరం ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 15 వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికలపై ఈ కేసు ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది.
వచ్చే నెల 15 వ తేదీ వరకు అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరూ వివేకా హత్యకేసుపై మీడియా ముందుగానీ, బహిరంగ సభల్లో కానీ మాట్లాడొద్దంటూ ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుసహా టీడీపీ నేతలు, ఇటు జగన్ తో పాటు వైసీపీ నేతలు వివేకా హత్యపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సీరియస్ గా హెచ్చరించింది.
అంతేకాదు ఇకపై హత్యగురించి మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలని స్ట్రిక్ట్ గా ఆదేశించింది హైకోర్టు. సిట్ విచారణ యధావిధిగా కొనసాగించుకోవచ్చని సూచించింది. అయితే సిట్ అధికారులెవరూ మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు ఏవీ బహిర్గతం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
కాగా సిట్ విచారణలో బయటపడ్డ వివరాలు వెల్లడించవద్దంటూ ఈసీని, హైకోర్టుని ఆశ్రయించారు వైసీపీ నేతలు. ఈ విషయంలో వైసీపీ విజయం సాధించినట్టయింది. కాగా దీనిపై టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/movie-review-lakshmis-ntr/