తిరుపతి మాజీ ఎంపీ, నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వరప్రసాద్ రావు వెలగపల్లి నడిరోడ్డుపై తాగి బీభత్సం సృష్టించారు. రోడ్డుపై వెళ్లేవారిని ఆపి హంగామా చేశారు.
వరప్రసాద్ వృత్తిరీత్యా డాక్టర్ కూడా. ఉన్నత చదువులు చదివి, ఉన్నతమైన వృత్తిలో ఉన్న వీరు సమాజానికి మేలు చేస్తారనుకుని ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు. ఈసారి ఆయనకి గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇప్పుడు ఆ పెద్దమనిషి ఇలా ప్రవర్తించడం ఏంటని జనం ఆగ్రహిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ రౌడీల పార్టీ, గుండాల పార్టీ అంటూ ప్రత్యర్ధులు ధ్వజమెత్తుతున్న వేళ ఈయన ఇలా తాగి నడిరోడ్డు మీద భీభత్సం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలాంటి వ్యక్తులనా మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేది? ఇలాంటివారినా గెలిపించి అసెంబ్లీకి పంపేది? ఒక డాక్టర్ అయుండి మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని హితవు చెప్పాల్సింది పోయి, తాగి నడిరోడ్డు మీద రచ్చ చేస్తూ జనానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో కింద ఉంది చూడండి.