ఉన్నఫలానా, ఎలాంటి వివరణ కోరకుండా ఒక ఫిర్యాదుతో తనన బదిలీ చేయడం మీద శ్రీకాకుళం ఎస్ పి వెంకటరత్నం ఆగ్రహంతో ఉన్నారు. నిరాధార ఆరోపణలతో తన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారని ఆయన ఆవేదన చెందుతున్నారు
వైసిపి రాజ్యసభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుతో కడప ఎస్ ఫి రాహుత్ శర్మ, శ్రీకాకుళం ఎస్ పి వెంకట రత్నం, ఇంటెలిజెన్స్ శాఖ అధిపతి వెంకటేశ్వరరావులను ఎన్నికల కమిషన్ బదిలీ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానిత శ్రీకాకులం ఎస్ పి వెంకటరత్నాన్ని బదిలీ చేసి ఎన్నికలను విధులనుంచి తప్పించారు. ఈ బదిలీకి ఆయన స్పదించారు. మూడు పేజీల ఘాటైన లేఖను ఎన్నికల ప్రధానాధికి ద్వివేదికి పంపిచారు. నాన్ క్యాడర్ కు చెందిన వెంకటరత్నానికి నిజాయితీ పరుడనే పేరుంది.అందుకే ధైర్యంగా ఎన్నికల కమిషన్ ను నిలదీసేందుకు సిద్ధమయ్యారుని ఆయన సహచరులుచెబుతున్నారు.
లేఖ సారాంశం:
వైసిపి నేత విజయ సాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని చెబుతు ఆ ఆరోపణల పస లేని విషయాన్ని లేఖలో వివరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేరిన విజయసాయి రెడ్డి బృందంపై 182 ఐపీసీ కింద విజయసాయి రెడ్డి కేసు వేస్తున్నట్లు కూడా ఆయన లేఖలో స్పష్టంగా చెప్పారు.
తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని లేదా ఆరోపణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎస్ పి ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు.
ప్రధాన ఆరోపణ
మార్చి 18 వ తేదీన విశాఖ పట్టణం లోని నారాయణ కాలేజీ నుంచి రు 50 కోట్ల రుపాయలను తరలిస్తున్న కారును వెంకటరత్నం స్వయంగా ఎస్కార్ట్ చేస్తూ ఆడబ్బు అందాల్సిన వారికి అందించాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎ బి వెంకటేశ్వరరావు ఫోన్ చేశాకే ఎస్ పి ఈ పని చేశారు. ఈ డబ్బును టిడిపి క్యాండిడేట్ కొండ్రమురళి మేనల్లుడు తీసుకువెళ్తున్నాడు.
ఎస్ పి వివరణ
ఇది శుద్ధ అబద్దమని వెంకటరత్నం లేఖలోపేర్కొన్నారు. మార్చి 18 వ తేదీన తాను కార్యాలయం దాటి పోలేదని, ఆ రోజంగా జిల్లా క్రయిమ్ మీటింగ్ లోను,నక్సల ప్రభావిత ప్రాంతాలలో ఎన్నికల ఏర్పాట్లసమావేశంలోనూ ఉన్నానని ఆయన వివరించారు. ఆ రోజు తాను ఎవరి కాల్ ను రిసీవ్ చేసుకోలేదని కూడా ఆయన చెప్పారు.
విజయ సాయి రెడ్డి ఆరోపణల ఆధారంగా తనపై గంటలలో బదిలీ వేయడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విధంగానే తాను దోషో నిర్దోషో కూడా తేల్చాలన్న ఆయన చెప్పారు. ఈ వ్యవహారం తన ప్రతిష్టకు భంగం కలిగించిందని పరువు నష్టం దావా వేస్తున్నానని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు.
తాను ఎస ఐ స్థాయి నుంచి ముప్పై ఏళ్ళు నిజాయితీగా శ్రమించి ఈ స్థాయికి వచ్చానని, నిరాధారమయిన ఆరోపణలతో తన ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబం, మిత్రులు, బంధువులు, సమాజం తాను వ్యక్తిత్వాన్ని అనుమానించే పరిస్థితి వచ్చిందని చెబుతూ సెక్షన్ 182 కింద ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులయిన వారి మీద కేసు నమోదు చేయించాలని ఆయన కోరారు.
‘నా ఆత్మ గౌరవం, నా పరువు ప్రతిష్టలను కాపాడుకోవలసి అవసరం ఉంది’, ని ఆయన లేఖ ముగించారు.