కేసీఆర్, రైతు శరత్ ఫోన్ సంభాషణ లో కొత్త ట్విస్ట్ (ఆడియో)

మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను వీడియో రూపంలో సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వీడియోను చూసిన వెంటనే కేసీఆర్ స్పందించారు. వారికి పూర్తి న్యాయం చేస్తానని సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ లో మాట్లాడి కలెక్టర్ ను వారి ఇంటికి పంపారు.

అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. అవతలి కుటుంబ సభ్యురాలు కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతి కొత్త విషయం చెప్పారు. కొండపల్లి రాజలింగు  తాత అని ఆయన పేరు మీద ఉన్న రెండు ఎకరాల భూమిని మా పేరు మీదికి పట్టా చేయించుకోవాలనుకుంటే కొండపల్లి శంకరయ్య కూడా వాటా అడిగారు. ఇది ఉమ్మడి ఆస్తి.

అలా అయితే సర్వే నెంబర్ 271 లో ఉన్న 7 ఎకరాల 1 గుంట భూమిలో కూడా మాకు వాటా వస్తుందని ప్రశ్నించాం. ఈ భూమిని శంకరయ్య దొంగతనంగా తన పేరు మీద పట్టా చేయించుకున్నాడు. అప్పుడు మేం ఏం అనలేదు. 7 ఎకరాల 1 గుంట లో వాటా అడిగితే దానికి వారు ఒప్పుకోలేదు. వీరు అన్నదమ్ముల పిల్లలు. ఆస్తుల వాటాలో వచ్చిన గొడవ ఇదన్నారు. మేం హైదరాబాద్ లో ఉండడం లేదు. కనీసం గ్రామంలో కానీ, అధికారులతో కానీ సీఎం గారు విచారించకుండా మాట్లాడడం సరైంది కాదన్నారు. మాకు కూడా న్యాయం చేయాలని జ్యోతి సీఎం కేసీఆర్ ను కోరారు.

పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఒక సైడే చూసి ఎలా పూర్తి న్యాయం చేస్తారని జ్యోతి కేసీఆర్ ని ప్రశ్నించారు. జ్యోతి మాట్లాడి విడుదల చేసిన ఆడియో ట్రెండింగ్ తెలుగు న్యూస్ ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తుంది. ఆడియో కింద ఉంది వినండి.

 

ఇది కూడా చదవండి…

https://trendingtelugunews.com/kcr-serious-on-telangana-revenue-staff/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *