ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి చేరేవరకు వంగవీటి రాధాకృష్ణ ఎపిసోడ్ ఆద్యంతం రసవత్తరంగానే సాగింది. వైసీపీలో సెంట్రల్ సీటు విషయంలో రగిలిన వైరం రాధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి దారి తీసింది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా, సీఎం కుర్చీ టార్గెట్ గా ముందుకు వెళుతున్న జగన్ అభ్యర్థుల ఎంపికలో కఠినంగా వ్యవహరించారనేది రాధా విషయంలో స్పష్టంగా వెల్లడైంది.
ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా గెలుపు గుర్రాలుగా భావించిన వారికే టికెట్లు కేటాయించారు. దీంతో సెంట్రల్ సీటు కోసమే పట్టుబట్టిన రాధాకి భంగపాటు కలిగింది. వంగవీటి రాధాకి, పార్టీ సీనియర్ నేతలకి మధ్య కొంతకాలం చర్చలు జరిగాయి. సెంట్రల్ సీటుపై అటు హైకమాండ్ కానీ, ఇటు రాధా కానీ ఏ ఒక్కరు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీని వీడి రాధా బయటకి వచ్చారు. అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్తుపై రకరకాల చర్చలు జరిగాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ రాధా టీడీపీ గూటికి చేరారు.
రాధా టీడీపీలో చేరిన తర్వాత తండ్రిని చంపిన పార్టీలో చేరాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. తాజాగా వైసీపీ నేత కావటి మనోహర్ నాయుడు వంగవీటి రాధాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన… టీడీపీ కోసం వంగవీటి రాధా ప్రచారం చేయడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని క్రూరంగా చంపిన టీడీపీ నేతలతో కలిసి రాధా ప్రచారం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.
“రంగాని టీడీపీ నేతలు హత్య చేయలేదు అంటున్న రాధా మాటలు వింటుంటే… “అసలు నువ్వు రంగా కడుపున పుట్టావా? అన్న అనుమానం వస్తుంది. మీ ఇంటి పేరు వంగవీటి కాదు చెన్నుపాటి గా మార్చుకోవాలంటూ” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కావటి మనోహర్ నాయుడు. ప్రస్తుతం వంగవీటి రాధాపై కావటి మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎన్నికల ముందు కావటి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతాయేమో అంటూ వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు.
This is attitude of every YSRCP leaders to spread bad remarks against TDP leaders. That is not good to the Monahar Naidu and YSRCP party.