మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పట్లో జగన్ అక్రమాస్తుల కేసులో ఈయన పేరు ఉమ్మడి రాష్ట్రమంతా మారుమ్రోగింది. ఆ కేసులో ఈయన వేసే ప్రతి అడుగును మీడియా సెన్సేషన్ గా చిత్రీకరించేది.
అప్పుడే కాదు ఆయన తన పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడం దగ్గర నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టటం వరకూ ప్రతిదీ చర్చనీయాంశమే. జగన్ కేసుల విషయంలో వైసీపీ వర్గాలు, జగన్ అభిమానులు లక్ష్మీనారాయణను ఎప్పుడూ ఒక విలన్ గానే భావిస్తూ, విమర్శలు, ఆరోపణలు చేస్తూనే వచ్చారు.
జగన్ కేసుల విషయంలో చంద్రబాబు, లక్ష్మీనారాయణ కలిసి కుట్ర పన్నారంటూ ఇప్పటికీ వారు ప్రధానంగా ఆరోపిస్తుంటారు. కానీ లక్ష్మి నారాయణ విషయంలో అందరిని షాక్ కి గురి చేసే వార్త ఇప్పుడు బయటకి వచ్చింది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
జేడీ రిటైర్మెంట్ తర్వాత రాష్ట్రమంతా పర్యటించి రైతుల సమస్యల గురించి తెలుసుకున్నారు. ఆయన స్వంతంగా పార్టీ పెట్టాలి అనుకుంటున్నట్టు స్వయంగా వెల్లడించారు. సొంతగా పార్టీలు పెట్టి విజయం సాధించిన వారిని, విఫలమైనవారిని, రాజకీయ అనుభవం ఉన్నవారిని ఇలా చాలామందిని కలిశారు. కొన్ని కారణాల వలన ఆయన పార్టీ స్థాపించాలి అనే నిర్ణయాన్ని విరమించుకున్నారు.
తన ఆలోచనలకూ, విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలో చేరాలి అనుకుంటున్నట్టు ప్రకటించారు. ఆయన ప్రకటన తర్వాత వివిధ పార్టీల నేతలు ఆయనతో చర్చలు జరిపారు. తమ తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. ఆయన టీడీపీలోనే చేరతారంటూ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.
ఇక వైసీపీ శ్రేణులు జేడీ టీడీపీలో చేరతారు అనగానే పెద్ద ఎత్తున విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలెట్టారు. అయితే అనూహ్యంగా ఆయన జనసేన పార్టీలో చేరి అందరిని షాక్ కి గురి చేశారు. కాగా జేడీని మా పార్టీలో చేరండి అని ఆహ్వానించిన వారిలో వైసీపీ కూడా ఉండటం విశేషం. వైసీపీ నుండి కూడా ఆయనకి ఆహ్వానం అందిన విషయాన్ని జేడీ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మిమ్మల్ని చంద్రబాబు మనిషిగా విమర్శించే పార్టీ నుండి ఆహ్వానం ఎలా వచ్చింది అని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు. నా ఆలోచనలు, విధానాలు ముందే చెప్పాను. సానుకూలంగా అనిపిస్తే ఎవరైనా అడగవచ్చు. పైగా రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం అని చెప్పారు జేడీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/kcr-serious-on-telangana-revenue-staff/