కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ఖాతాలో ఘనవిజయం చేరుకుంది. వైసీపీ అధినేత కొంతకాలంగా బలంగా ఆశిస్తున్న కోరిక నెరవేరింది. ఇంతకీ వైసీపీ ఖాతాలో చేరిన ఘన విజయం ఏమిటి? జగన్ బలంగా ఆశించిన అంశం ఏమిటి? ఈ వివరాలు తెలియాలంటే కింద ఉన్న మ్యాటర్ చదవండి.
వైసీపీ అండ్ కో ఎప్పటి నుండో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన, మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు పైన పలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. వీరు ప్రజలకు కాకుండా టీడీపీకి సేవలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు వైసీపీ నేతలను టీడీపీలోకి మార్చడం కోసం బాగా కృషి చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున బహిరంగ ఆరోపణలు కూడా చేశారు.
అంతేకాదు కొంతమంది అధికారులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, కేంద్ర ఎన్నికల కమిషనర్ కి పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారు జగన్. ఇటీవలే గోరంట్ల మాధవ్ కూడా ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావును, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలను ఎన్నికల విధుల నుంచి తప్పించింది.
ఈ ముగ్గురినీ బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఎటువంటి ఎన్నికల పనులు అప్పగించొద్దని ఈసీ పేర్కొంది. వీరు ముగ్గురు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని సూచించింది. కాగా వీరి స్థానాల్లో తదుపరి సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించనుంది ఈసీ. దీంతో వైసీపీ కృషి ఫలించినట్టయింది.