టిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల తొలి జాబితాలో సీనియర్ నేత, మాజీ మంత్రి హారీష్ రావుకు చోటు దక్కింది. ఆదివారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా హారీష్ కు చోటు దక్కలేదు. సీఎం కేసీఆర్, కేటిఆర్ సహా 20 మందికి జాబితాలో చోటు దక్కింది. హారీష్ పేరు లేకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
దీంతో టిఆర్ఎస్ అధిష్టానం వెంటనే అలర్ట్ అయ్యి సోమవారం రాష్ట్ర సీఈసీ రజత్ కుమార్ కు లేఖ రాసింది. టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ స్థానంలో హారీష్ రావు పేరును చేర్చాలని కోరింది. దీంతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హారీష్ రావు పేరు కూడా చేర్చారు. హారీష్ రావు పేరు చేర్చడంతో పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు.
హారీష్ రావు కు టిఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యం తగ్గిందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవిని కూడా ఉద్దేశ్యపూర్వకంగానే ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో హారీష్ పేరు లేకపోవడంతో ఒక్కసారిగా టిఆర్ ఎస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పొరబాటును గమనించిన టిఆర్ఎస్ పెద్దలు హారీష్ కు చోటు దక్కేలా చేశారు. దీంతో హారీష్ రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఆ ప్రచార కార్యక్రమంలో హారీష్ రావు తప్ప మరొకరు ఉండేవారు కాదు. ఆయన ఏ ఎన్నికల ప్రచారానికి వెళ్లినా అక్కడ ఆయన విజయదుందుంభి మోగించేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన తెరచాటుకు మాత్రమే పరిమితమయ్యారు. ఇది పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలల్లో పెద్ద చర్చకు దారి తీసింది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో వీరి పేర్లున్నాయి.
కేసీఆర్
తలసాని శ్రీనివాస్ యాదవ్
గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
మహమూద్ అలీ
హారీష్ రావు
ఇంద్రకరణ్ రెడ్డి
కొప్పుల ఈశ్వర్
ఎర్రబెల్లి దయాకర్ రావు
నిరంజన్ రెడ్డి
ప్రశాంత్ రెడ్డి
శ్రీనివాస్ గౌడ్
కేటీఆర్
కేశవరావు
బండ ప్రకాష్
పల్లా రాజేశ్వర్ రెడ్డి,
శేరి సుభాష్ రెడ్డి,
శ్రవణ్ కుమార్ రెడ్డి
రవీందర్ రావు
సి హెచ్ మల్లారెడి