మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు కొద్దిరోజుల ముందే ఆయన హత్యకు గురవడంతో… ఈ హత్య రాజకీయ రంగు పులుముకొని రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ హత్య టీడీపీ నేతల కుట్రగా వైసీపీ వర్గాలు ఆరోపిస్తుంటే… ఇంటి దొంగల పనే అంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.
వివేకా హత్యకేసు మిస్టరీ ఇంకా పూర్తిగా వీడలేదు. ఈ హత్యకేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కేసులో అనుమానితులుగా ఉన్న పరమేశ్వరరెడ్డిని, చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది సిట్. వివేకా హత్య కేసులో అనుమానితుల సంఖ్య రోజురోజుకి పెరగడంతోపాటు పలు మలుపులు తిరుగుతోంది.
వివేకా మరణించిన ఐదు రోజుల తర్వాత ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రితో ఆమెకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకుని ఆవేదన చెందారు. తన తండ్రి మర్డర్ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని సిట్ ని కోరారు. కేసు విచారణలో ఉండగా ఎటువంటి విషయాలు వెల్లడించాలి అనుకోవట్లేదని, అవి దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. కాగా తాజాగా వివేకా కుమార్తె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆమె నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ వివరాలు కింద ఉన్నాయి చూడండి.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదితో దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సమావేశమయ్యారు. భర్త రాజశేఖరరెడ్డితో కలిసి ద్వివేదీని కలుసుకున్న సునీత.. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు సిట్ అధికారుల విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని విమర్శించారు.
సీఎం తీరుతో విచారణ పక్కదారి పట్టే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని సునీత… గోపాలకృష్ణ ద్వివేదీకి విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తన తండ్రి హత్య విషయంలో జరుగుతున్న రాద్దాంతాన్ని ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ దృష్టికి తీసుకెళ్లామని, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ లను ద్వివేదీకి అందజేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/posani-krishna-murali-hot-commentes-on-pawan/