వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భార్యను మర్చిపోయాడు. తాను సమాజంలో గౌరవమైన వృత్తిలో ఉన్నానని కూడా ఆలోచించకుండా పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకొని భార్యకు రెఢ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడు. దీంతో చివరకు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో అనిల్ కుమార్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య అంకిత రమ్య ఉన్నారు. గత కొంత కాలంగా అనిల్ భార్యను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన రమ్య ఆరా తీయగా అతనికి మరో ఇద్దరు ముగ్గురు మహిళలతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించింది. రెండు సార్లు ఓ మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పెద్ద మనుషులలో పెట్టింది.
అయినా కూడా అతనిలో మార్పు రాకపోవడంతో సూర్యాపేట ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సమస్య పరిష్కరించాలని హుజుర్ నగర్ సీఐని ఎస్పీ ఆదేశించారు. కౌన్సిలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో నేరేడు చర్ల పీఎస్ లో అతని పై కేసు నమోదయ్యింది. ఇదే సమయంలో అనిల్ ఓ క్రిమినల్ కేసులో ఇన్వాల్స్ అయ్యాడని తేలింది. దీంతో అనిల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సూర్యాపేట ఎస్సీ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు.