తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్ధి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎల్ బీ నగర్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రేవంత్ కేసీఆర్ అరాచకత్వాన్ని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏమన్నారంటే…
“కేసీఆర్ కు అరాచకాలకు వ్యతిరేకం. టిఆర్ ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, సానుభూతి పరులకు నేను వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నారు. ఇంత అరాచకమా. ఇది సమాజంలో మంచిదా అనేది ఆలోచించాలి. ఒక కుటుంబం కోసం 1200 మంది అమరుల త్యాగాలను తాకట్టు పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి నాకాడ దుడ్లు లేవు. కానీ నా గుండెల్లో ఉన్న దైర్యాన్ని గుంజుకోలేరు. బిడ్డా కేసీఆర్ నీకు సమాధి కట్టేది నేను.. నా కాంగ్రెస్ పార్టీ. వాళ్లు వీళ్లు ఎందుకు రా నువ్వే రా నా మీద పోటికి. తేల్చుకుందాం.
కేసీఆర్ నీకు అలవాటే కదా. ఓ సారి కరీంనగర్ మరోసారి పాలుమూరు. ఇప్పుడు ధైర్యం ఉంటే నా మీద పోటి చేయి. నా పై రియల్టర్లను దింపాలని చూస్తున్నావు. సబిత కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో చేసింది. నన్ను పోటి చేయమని చెప్పి సబిత టిఆర్ఎస్ లోకి పోవడం న్యాయమా. కేసీఆర్ బకాసురుడు. ప్రతిపక్షాన్ని మింగేయాలని చూస్తున్నాడు. కౌరవులు నూరు ..పాండవులు ఐదుగురే ..గెలిచింది పాండవులే. టీఆరెస్ నూరైనా ..పాండవుల్లాగా కాంగ్రెస్ దే గెలుపు. కల్వకుంట్ల కుటుంబం కూలిపోవాలంటే ..కార్యకర్తలు విల్లులు ఎక్కుపెట్టాలి ..సైన్యాధ్యక్షుడిగా నేను ముందుండి పోరాడుతా .
నా మెడ తెగిపడే వరకు కేసీఆర్ తో పోరాడుతూనే ఉంటా . మల్కాజ్ గిరి లో ఉన్న నిరుద్యోగులు ఓట్లేస్తే చాలు రెండు లక్షలతో గెలుస్తా. నా ఎన్నికలను పక్కనపెట్టి సుదీర్ రెడ్డికి ప్రచారం చేశా. ఇదేనా నేను చేసిన పాపం. నా ఇంటికొచ్చి మాల్కాజ్ గిరి లో పోటీచేయమన్నది సుధీర్ రెడ్డి కాదా. నేను చెప్పింది నిజమని దేవుడి మీద ఒట్టేస్తా ..సుధీర్ వస్తాడా . సుధీర్ రెడ్డి టీఆరెస్ లోకి ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలి . కాంగ్రెస్ పుణ్యమని సుధీర్ రెడ్డి కి ప్రగతిభవన్ లో ధర పలికింది. ప్రజలకోసం ప్రశ్నిస్తే నా పై ప్రభుత్వం వందల అక్రమ కేసులు పెడుతుంది. నేను భయపడను” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/warner-reenters-ipl-after-a-ban/