టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మంగళవారం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆయన బహిరంగ లేఖ పంపించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కోసం మీతోపాటు అనేక కష్టనష్టాలకు ఓర్చి రేయింబవళ్లు కష్టపడ్డానని అయినప్పటికీ రాష్ట్రంలో పార్టీ మనుగడ ప్రశ్నార్థకమయిందన్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పొలిట్‌బ్యూరో పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు. కాగా, నామా నాగేశ్వర్రావు త్వరలో టీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలిసింది. ఖమ్మం ఎంపీ స్థానానికి ఆయన పోటి చేయనున్నారని తెలుస్తోంది. దీంతో తెలంగాణలో టిడిపి దుకాణం బంద్ అయిందని చర్చ జరుగుతోంది. బలంగా ఉన్న ఒకరిద్దరు నేతలు పార్టీని వీడడంతో తెలంగాణలో టిడిపి భవిష్యత్తు అంధకారంలో పడిందని పలువురు చర్చించుకుంటున్నారు.